Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 17 2014 @ 03:18AM

రాష్ట్రంలోని అన్ని విద్యుత్తు సబ్‌స్టేషన్లు ఆన్‌లైన్‌ చేస్తాం

జమ్మలమడుగు: రాష్ట్రంలోని అన్ని విద్యుత్తు సబ్‌స్టేషన్లు ఆన్‌లైన్‌ చేస్తామని, వినియోగదారుల అన్ని సర్వీసులు ఆధార్‌, మొబైల్‌ నంబర్లకు అనుసంధానం చేస్తామని ఏపీఎస్పీడీసీఎల్‌ నెల్లూరు, చిత్తూరు, కడపజిల్లాలకు చెందిన విద్యుత్తు చీఫ్‌ ఇంజినీరు నందకుమార్‌ (తిరుపతి) పేర్కొన్నారు. మంగళవారం ఆయన జమ్మలమడుగులోని 33/11 కె.వి. విద్యుత్తు సబ్‌స్టేషన్‌ను పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేసి కిందిస్థాయి అధికారులకు సూచనలు చేశారు. పట్టణ ఏఈ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అక్టోబరు 2వ తేదీ నుంచి రాష్ట్రంలో 247 గంటలు విద్యుత్తు సరఫరా ఉందే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. విద్యుత్తు బిల్లులు ఎక్కువ, తక్కువ వస్తున్నట్లు వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఐఆర్‌డీఏ మీటర్లు ఏర్పాటు చేశామన్నా రు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 60 శాతం మీటర్లు ఉంచామన్నా రు. బిల్లింగ్‌ కచ్చితంగా వస్తుందని, సిబ్బంది అవినీతికి పాల్పడే అవకాశం ఉండదన్నారు. ప్రజలకు సమాచారం వెళ్లేందుకు ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నామన్నారు. జమ్మలమడుగులో విద్యుత్తు వినియోగానికి, సరఫరాకు సమతుల్యం ఉందని, లో ఓల్టేజీ వచ్చే ప్రసక్తిలేదన్నారు. సబ్‌స్టేషన్ల మెయింటెనెన్స్‌ ప్రతినెల రెండో శనివారం చేపట్టాలని ఈ విషయాన్ని వినియోగదారులకు ముందుగా తెలియజేసి అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో విద్యుత్తు ఎస్‌ఈ గంగయ్య, డీఈ విజయన్‌, ఏడీఈ కృష్ణదేవ, ఏఈ తిరుమలదాస్‌, రూరల్‌, మైలవరం మండలాల ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు.