desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 17 2014 @ 03:18AM

ఏబీఎన్‌ ప్రసారాలు పునరుద్ధరించాలని వినతి

సూర్యాపేటటౌన్‌ : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కుట్రతో ఏబీఎన్‌, టీవీ9 ప్రసారాలను నిలిపివేసిందని తిరిగి ప్రసారాలను కొనసాగించాలని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు సగరపు ప్రసాద్‌ అన్నారు. మంగళవారం పట్టణంలోని ఎంజీ రోడ్డులోని గాంధీవిగ్రహం వద్ద టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో మీడియా ప్రసారాలకు నిలిపివేతకు నిరసనగా గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేసి ఆయన మాట్లాడారు. నిజాలు నిర్బయంగా ప్రజలకు ప్రసారం చేస్తున్న ఏ బీఎన్‌ చానల్స్‌ను నిలిపివేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా మీడియా ప్రతినిధులపై దాడులు చేసిన చరిత్ర టీఆర్‌ఎస్‌కు దక్కుతుందని ఆరోపించారు. గాంధీజీకి వినతి పత్రం ఇస్తే ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిపించి ఏబీఎన్‌, టీవీ 9ప్రసారాలను పునరుద్దరిస్తారని తెలిపారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బద్దం ప్రవీణ్‌రెడ్డి, పవన్‌, లింగయ్య, మాధవి, రజిత, అంజలి, మమత, శ్రీను, ద్వారకేష్‌, రామ్‌, నవీన్‌, ఉపేందర్‌, అజయ్‌, లోకేష్‌, రాజేష్‌, కిరణ్‌ పాల్గొన్నారు.