Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 17 2014 @ 02:39AM

పలుచోట్ల ‘ఓజోన్‌’ ర్యాలీలు
రుద్రంపూర్‌ : ఓజోన్‌ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని.. డివిజన్‌లోని పపలు ప్రాంతాల్లో మంగళవారం ప్రదర్శనలు నిర్వహించారు. కొత్తగూడెంలోని సింగరేణి డిగ్రీ, పీజీ కళాశాల విద్యార్థినులు ర్యాలీ నిర్వహించారు. ఓజోన్‌ పొర రక్షణే జీవ జాతికి సంరక్షణ అని, పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎం. కమలరాణి, సైన్స్‌ క్లబ్‌ నిర్వాహకులు జి. రత్నకుమారి మాట్లాడారు. కార్యక్రమంలో సైన్స్‌ అధ్యాపకులు డాక్ట ర్‌ వివి. రమణ, వి.ఉషారాణి, ఎం.సీతా మహాలక్ష్మీ, ఎ.రత్నమాల, ఎస్‌. శ్రీలత, జి. శైలజ, ఎస్‌. మాధవి, కె.శ్రీలత, వి.మౌనిక, పావని, సరోజ, స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.
పాల్వంచలో..
పాల్వంచ రూరల్‌ : పాల్వంచలో అటవీ అధికారులు, సిబ్బంది, పాఠశాల విద్యార్దులు ఓ జోన్‌ పరిరక్షణ కోరుతూ మంగళవారం గ్రీన్‌ రన్‌ నిర్వహించారు. స్ధానిక ఫారెస్ట్‌ కా ర్యాలయం నుంచి అంబేద్కర్‌ సెంటర్‌, బిసీఎం రోడ్డు, ఆర్డీవో కార్యాలయం నుంచి శాస్ర్తిరోడ్డు మీదుగా గ్రీన్‌ రన్‌ నిర్వహించారు. కార్యక్ర మంలో ఫారెస్ట్‌ రేంజర్‌ వెంకటేశ్వరరావు, డీ ఆర్‌వో శ్రీను, వీరబాబు పాల్గొన్నారు.
ఏన్కూరులో..
ఏన్కూరు : ఏన్కూరులోని బాలికోన్నత పాఠశాల విద్యార్థినులు, ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించారు. ఓజోన్‌ పొర రక్షణే జీవ జాతి కి సంరక్షణ అని, పచ్చని చెట్లు ప్రగతికి మె ట్లు అంటూ విద్యార్థులు నినాదాలు చేశా రు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పద్మకుమారి, నిర్మల జ్యోతి, నాగమణి, పద్మ, అన సూయ, సుజాత తదితరులు పాల్గొన్నారు. మండల పరిధిలోని తిమ్మారావుపేట గ్రామంలో కారేపల్లి రేంజ్‌ అటవీశాఖ ఆధ్వర్యంలో ఓజోన్‌ పొర పరిరక్షణ దినోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో అటవీ రేంజ్‌ అధికారిణి నాగమణి మాట్లాడారు. కార్యక్రమంలో అటవీశాఖ సెక్షన్‌ అధికారులు లక్ష్మీపతి, సురేష్‌, రామకృష్ణ పిచ్చేశ్వరరావు, సుప్రియా, ప్రధానోపాధ్యాయులు ఉమా శంకర్‌, బీట్‌ అధికారులు పాల్గొన్నారు.
జూలూరుపాడులో..
జూలూరుపాడు : అడవులను పరిరక్షిం చాలని కోరుతూ జూలూరుపాడులో ర్యాలీ నిర్వహించారు. తల్లాడ అటవీరేంజ్‌ పరిధిలోని వివిధ మండలాలకు చెందిన అధికారులు ర్యాలీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో తల్లాడ అట వీరేంజ్‌ అధికారి రాజేశ్వరరావు, గుండెపుడి సె క్షన్‌ అధికారి రాజేష్‌, సురేష్‌, మల్లయ్య, మస్తాన్‌, రాములు తదితరులు పాల్గొన్నారు.