Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 17 2014 @ 02:23AM

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు


గార్లదిన్నె: సంక్షేమ ఫలాలు అర్హులందరికీ అందేలా కృషి చేస్తానని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖామంత్రి రావెల కిశోర్‌బాబు పేర్కొన్నారు. మంగళవారం ఆయన జిల్లాకు విచ్చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వవిప్‌ యామినిబాల, టీడీపీ నాయకులు ముంటిమడుగు కేశవరెడ్డి, జడ్పీటీసీ విశాలాక్షి, పలువురు టీడీపీ నాయకులు కల్లూరు వద్ద మంత్రి రావెలకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి కిశోర్‌బాబు డా.బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించా రు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అక్టో బర్‌ 2వ తేదీన ముఖ్యమైన నాలుగు పథకాలను అమలు చేస్తున్నామన్నారు.
సాగునీరు ఇవ్వండి సారూ...
ఖరీఫ్‌ సీజన్‌లో సాగునీరు ఇవ్వాలని ఈ సందర్భగా పలువురు రైతులు మంత్రిని విన్నవించారు. ఖరీఫ్‌లో సాగునీరు ఇవ్వకపోతే ఎ లా బతకాలని ఆయనతో ఆవేదన వ్యక్తం చే శారు. ఆయన వెంటనే జిల్లా కలెక్టర్‌ సొలమన్‌ ఆరోగ్యరాజ్‌కు ఫోన్‌ చేసి సమస్యను పరిష్కరించాలని సూచించారు. అనంతరం గార్లదిన్నెలో ఎమ్మార్పీఎస్‌ నాయకులు ఆయనకు స్వాగతం పలకగా.. అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. జడ్పీటీసీ విశాలాక్షి ఫ్యాక్టరీలో విందు ఏర్పాటు చేశారు.
బోగస్‌ పింఛన్ల ఏరివేతకు కమిటీలు
గుత్తి: రాష్ట్ర వ్యాప్తంగా బోగస్‌ పింఛన్లను ఏరివేయడానికి జిల్లా, మండల స్థాయి, మున్సిపాలిటీలలో కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు సాంఘిక సంక్షేమ మంత్రి శాఖ రావెల కిశోర్‌ బాబు పేర్కొన్నారు. మంగళవారం మంత్రి ఆ కస్మికంగా స్థానిక మున్సిపల్‌ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ము న్సిపాలిటీకి వచ్చే ఆదాయ వనరులు, నీటిపన్నులు, ఇంటిపన్నులు ఇత్యాది అంశాలపై ము న్సిపల్‌ కమిషనర్‌ ఇబ్రహింసాబ్‌ను అడిగారు. భూగర్భ జలాలు అడుగంటడంతో నీటి సమస్య ఉత్పన్నమైందని, నిధులు కొరతగా ఉందని కమిషనర్‌ చెప్పారు. ఇందుకు ఆయన స్పందిస్తూ ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ కింద నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. లచ్చానుపల్లి రోడ్డులోని స్వస్థతశాలకు వెళ్లి ఫాదర్‌ అద్బుత్‌ కుమార్‌ వద్దకు వెళ్లి ప్రార్థన చేసిన అనంతరం మున్సిపల్‌ కార్యాలయాన్ని సందర్శించారు.
పలువురి అభినందనలు
అనంతపురం: మంత్రి రావెళ్ల కిశోర్‌ బాబుకు రోడ్లు, భవనాల అతిధి గృహం వద్ద ప్రభుత్వ విప్‌ యామినీ బాల, జడ్పీ చైర్మన్‌ చమన్‌, ఎమ్మెల్సీ శమంతకమణి, ఎమ్మెల్యేలు జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఉన్నం హనుమంతరాయచౌదరి, మేయర్‌ స్వరూప, ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.ఎస్‌ రాజు, కేశవనాయక్‌, బండారు శంకర్‌ అభినందించారు.