desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 17 2014 @ 02:23AM

మా నాన్నది హత్యే..


కల్లూరు(లేపాక్షి): మండలంలోని కల్లూరు గ్రామానికి చెందిన నాగప్ప(45)ది అనుమానాస్పద మృతి కాదనీ, హత్యేనని అతడి కుమారుడు నర్సింహప్ప పోలీసులకు ఫిర్యాదు చేశా డు. మంగళవారం నాగప్ప అనుమానాస్పదం గా మృతిచెందినట్లు భార్య లింగమ్మ ఫిర్యాదు చేసింది. ఈ విషయమై ఇన్‌చార్జి సీఐ మురళీకృష్ణ గ్రామానికెళ్లి విచారణ చేపట్టారు. నాగప్ప కుమారుడు నర్సింహప్ప వాదన మరోలా ఉం ది. తల్లి లింగమ్మ.. ఉపాధిహామీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న చౌడప్పతో కొంతకాలంగా వి వాహేతర సంబంధం కొనసాగిస్తుండేదన్నా డు. ప్రియుడితో కలిసి తల్లే తమ తండ్రి నాగప్పను గొంతు నులిమి చంపేసి ఉంటుందని సీఐకి నర్సింహప్ప తెలిపాడు. అనుమానాస్పద మృతిగా చిత్రీకరించారని ఆరోపించాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.