Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 17 2014 @ 00:33AM

నవంబర్‌ నుంచి కొత్త పింఛన్లు


 నెలాఖరులోగా ఇన్‌పుట్‌ సబ్సిడీ విడుదల
 పంచాయతీరాజ్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌

సిరిసిల్ల, సెప్టెంబర్‌ 16 :వృద్ధులు, వికలాంగులకు నవంబర్‌ మొదటి వారం నుంచి పెంచిన పింఛన్‌లను అందించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్‌, ఐటీ శాఖ మంత్రి కె. తారకరామారావు ప్రకటించారు. పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీని నెలాఖరులోగా విడుదల చేస్తామని ఆయన చెప్పారు. మంగళవారం కరీంనగర్‌ జిల్లా సిరిసిల్ల మున్సిపాలిటీ సమావేశం, మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలపై మంత్రి సమీక్షించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వృద్ధులు, వితంతువులకు ప్రతినెలా రూ.1,000, వికలాంగులకు రూ.1,500 చొప్పున నవంబర్‌ నుంచి అందిస్తామని ఆయన వెల్లడించారు. దీంతో పాటు తెలంగాణ రాష్ట్రం పేరుతో కొత్తగా రేషన్‌ కార్డులను జారీ చేస్తామన్నారు. ప్రభుత్వం ప్రకటించిన రైతు రుణాల మాఫీ తుదిదశకు చేరుకుందన్నారు. త్వరలోనే రైతులకు రుణమాఫీ బాండ్‌లను అందజేస్తామన్నారు. నాలుగేళ్లలో ప్రకృతి వైపరీత్యాలతో దెబ్బతిన్న పంటలకు తమ ప్రభుత్వం రూ.480 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీని మంజూరు చేసిందన్నారు. దీనివల్ల రాష్ట్రంలో 14 లక్షల మంది రైతులకు మేలు జరుగుతుందని, ఈ చెల్లింపులు ఈ నెల 23 నుంచి 30వ తేదీలోగా రైతుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు.. ఈ కార్యక్రమంలో జడ్పీసీఈవో సదాశివ్‌, పీడీడీఆర్‌డీఏ విజయ్‌గోపాల్‌, డ్వామా పీడీ గణేష్‌, చేనేత జౌళి శాఖ ఏడీ వెంకటేశ ్వర్‌రావు, పీఆర్‌ఎస్‌ఈ దశరథం, డీఆర్‌డీఏ ఏపీడీ రమేష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.టఫ൹6్శ్భ