Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 17 2014 @ 00:08AM

సర్కారు స్కూళ్లలోనే మెరుగైన విద్య


యూటీఎఫ్‌ జిల్లా
అధ్యక్షుడు మాణిక్‌రెడ్డి

దోమ: ప్రైవేట్‌ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్యనందించడం జరుగుతుందని యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు మాణిక్‌రెడ్డి అన్నారు. మంగళవారం దోమ బాలుర ఉన్నత పాఠశాలలో సమావేశం నిర్వహించారు. అనంతరం ఈ నెల 24న రవీంద్ర భారతి ఆడిటోరియంలో జరిగే రాష్ట్ర విద్యా సదస్సు వాల్‌పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో పని గంటలు పెంచినందుకు ఉపాధ్యాయులు సంతోషిస్తున్నారని పేర్కొన్నారు. పని గంటలకు అనుగుణంగానే ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక వసతులు కల్పించడంలో విద్యా వ్యవసన్థు ఎందుకు నిర్వీర్యం చేస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే ప్రైవేట్‌ పాఠశాలల కంటే ఉత్తీర్ణత శాతం ఎక్కువగా ఉంటుందన్నారు. 10 గదులు ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో స్వీపర్‌, వాచ్‌మెన్‌, మధ్యాహ్న భోజనం తయారు చేయడానికి వంట గదుల నిర్మాణంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు. కార్యక్రమంలో యూటీఎఫ్‌ మండల అధ్యక్షుడు చంద్రమౌళి, జీహెచ్‌ఎం వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. ఠ్టఝఛిఛ్క్కిట