desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 17 2014 @ 00:06AM

క‘నీ టి’ పాలు..

 నీళ్లపల్లిలో వంద ఎకరాల్లో కంది పంట వర్షార్పణం ఫనీట మునిగి ఊటపట్టిన పైరు...
ఎండుముఖం... తొలగిస్తున్న రైతన్నలు ఫ పట్టించుకోని అధికారులు

బషీరాబాద్‌: ఈ సారి పంటలు బాగున్నాయని పెట్టిన పెట్టుబడులకు ఎలాంటి డోకా లేదని ఆశించిన రైతన్నలకు ఇటీవల కురిసిన వర్షాలు వారి ఆశలను తుడ్చిపెట్టి కన్నీళ్లు మిగిల్చాయి. ఖరీఫ్‌లోసాగు చేసుకున్నా కంది పంట భారీ వర్షాలకు ఊటపట్టి ఎండు ముఖం పట్టడంతో అన్నదాత లబోదిమంటున్నాడు. సుమారుగా వంద ఎకరాల్లో కందిపంట నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు. ఏపుగా ఎదిగిన కంది పైరు కళ్లేదుటే ఎండు ముఖం పట్టడంతో రైతన్నలు కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. బషీరాబాద్‌ మండలంలోని నీళ్లపల్లి , జలాల్‌పూర్‌ గ్రామ రైతులు వీరారెడి 20 ఎకరాలు, మహేందర్‌రెడి 10 ఎకరాలు, వెంకటయ్య 2ఎకరాలు, సాకలి హన్మప్ప 3 ఎకరాలు, వడ్డే సాయిలు 2 ఎకరాలు, జహీర్‌లాల్‌ 3 ఎకరాలు, తదితర రైతులుఈసారి సుమారు వంద ఎకరాల్లో సాగు చేసి రాత్రింబవళ్లు కంటికి రెప్పలా కపాడుకుంటువచ్చారు. మరో రెండు మాసాల్లో పంట చేతికోచ్చి తమ అప్పులు తీరిపోతాయని ఆశించిన రైతన్నలకు కుండపోతవర్షాలతో కంది పంట పొలాలు నీట మునిగి జలమయమైయ్యాయి. దీంతో ఎదిగిన కంది పైర్లు రోజుల తరబడి నీట మునిగి వెర్లు కుళ్లిపోయాయి. చే౅సేదేమి లేక కంది ఫైరును పీకేస్తున్నారు. రబీ సాగుకు పొలాలు సిద్ధం చేసుకుంటున్నారు. నష్టపోయిన కంది పంట విస్తీర్ణాన్ని వ్యవసాయధికారులు అంచనా వేయలేదని రైతులు ఆందోళన చెందుతున్నారు.
అత్మహత్యే శరణ్యం....
భారీ వర్షాలతో కంది పూర్తిగా నీట మునిగి పాడై ఎండిపోతుంది. పంట సాగుకు చేసిన అప్పులు ఎలా తీర్చాలో అర్ధం కావడం లేదు. ్ల చేసిన అప్పులు తలుచుకుంటే చావాలనిపిస్తుంది. ప్రభుత్వం ఆదుకోకుంటే అత్మహత్యలే శరణ్యమని రైతువీరారెడ్డి వాపోయారు