desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 16 2014 @ 23:33PM

అంబరాన్నంటిన టీఆర్‌ఎస్‌ సంబురాలు

గజ్వేల్‌అర్బన్‌: మెదక్‌ పార్లమెంట్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి గెలుపుతో పట్టణంలో టీఆర్‌ఎస్‌ నాయకులు నగరపంచాయతీ ఛైర్మన్‌ గాడిపల్లి భాస్కర్‌ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచుకుని సంబురాలు చేసుకున్నారు. మంగళవారం ఉప ఎన్ని కల ఫలితాలు వెలువడిన అనంతరం పట్టణంలోని అంబేడ్కర్‌ విగ్రహం నుంచి ఇందిరాపార్కు చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నగరపంచాయతీ చైర్మన్‌ గాడిపల్లి భాస్కర్‌ మాట్లాడుతూ బంగారు తెలంగాణ నిర్మాణానికి అహర్నిశలు కృషిచేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ప్రజలు ప్రోత్సాహాన్నిచ్చేలా 100 రోజుల పాలనకు బహుమతిగా ఎంపీ సీటునిచ్చారన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం కృషిచేస్తున్న కేసీఆర్‌కు ఈ విజయం మరింత ఊపునిస్తుందని, మరింత ఉత్సాహాంతో బంగారు తెలంగాణ నిర్మాణం కోసం కృషిచేస్తామన్నారు. ప్రతిపక్షాల నాయకులు ఎన్ని కుయుక్తులు, కుట్రలు పన్నినా, ఎన్ని డబ్బులు కుమ్మరించినా అవేవీ తెలంగాణ ప్రజలు కేసీఆర్‌పై ఉంచిన నమ్మకం ముందు పనిచేయలేకపోయాయని ఛైర్మన్‌ గాడిపల్లి భాస్కర్‌ అన్నారు. ప్రతిపక్షాలు ఇప్పటికైనా ప్రభుత్వంపై సీఎం కేసీఆర్‌పై అనవసర విమర్శలు మాని తెలంగాణ పునర్నిర్మాణంలో భాధ్యత కలిగిన ప్రతిపక్షాలకు ప్రభుత్వంతో కలసి రావాలన్నారు.
ఈ కార్యక్రమంలో వైస్‌ చైౖర్మన్‌ అరుణా భూపాల్‌ రెడ్డి, కౌన్సిలర్లు నరేందర్‌రావు, స్రవంతి శ్రీనివాస్‌, సంతోషిణీ రామచంద్రాచారీ, మల్లమ్మ ఇస్తారి, గజ్వేల్‌ నర్సింలు, వసీంఖాన్‌, బోస్‌, జకీయొద్దీన్‌, రామదాసు, నక్కరేగొండ, మండలపార్టీ అధ్యక్షులు మద్ది రాజిరెడ్డి, నాయకులు దేవేందర్‌, బొగ్గుల సురేష్‌, నక్కీర్తగోపాల్‌, గాడిపల్లి బలరాం, ఎల్లాగౌడ్‌, యస్‌.నరేష్‌, గంగిశెట్టిరాజు, కళ్యాణ్‌కర్‌ కిషన్‌, పరమేశ్వర్‌, గాడిపల్లి అనూప్‌, శ్రీను, సాయి తదితరులున్నారు.
జగదేవ్‌పూర్‌లో..
జగదేవ్‌పూర్‌: మెదక్‌ పార్లమెంట్‌ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించడం పట్ల జగదేవ్‌పూర్‌ మండలంలో విజయోత్సవ సంబురాలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రమైన జగదేవ్‌పూర్‌తోపాటు అన్ని గ్రామా ల్లో పార్టీ కార్యకర్తలు, నాయకులు, తెలంగాణ వాదులు బాణసంచా పేలుస్తూ సంబురాలు జరుపుకున్నారు. జగదేవ్‌పూర్‌లో ర్యాలీ నిర్వహించి అంబేద్కర్‌ చౌరస్తావద్ద బాణసంచా కాల్చారు. గ్రామగ్రామాన ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జగదేవ్‌పూర్‌ జడ్పీటీసీ ఎంబరి రాంచంద్రం యాదవ్‌, ఎంపీపీ ఎర్ర రేణుకయాదగిరి, ఎంపీపీ ఉపాధ్యక్షుడు బుద్ధ వెంకటయ్య, టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ మాజీ ఇన్‌చార్జి కేశిరెడ్డి నర్సిం హారెడ్డి, యూత్‌వింగ్‌ రాష్ట్ర నాయకులు గుండ రంగారెడ్డి, మండలాధ్యక్షుడు యాదవరెడ్డి, సర్పంచ్‌లు కరుణాకర్‌, భాగ్యబాల్‌రాజు, సుధాకర్‌రెడ్డి, దర్శనాల మంగనర్సింలు, నరేశ్‌, మహేందర్‌, మల్లయ్య, నవ్యసుమన్‌, రజిత రమేశ్‌, రాధా రవీందర్‌రెడ్డి, ఎంపీటీసీలు బాలేషంగౌడ్‌, పీఏసీఎస్‌ చైౖర్మన్‌ వంటేరు నరేందర్‌రెడ్డి, కొండపోచమ్మ చైర్మన్‌ మల్లేశం, పార్టీ నాయకులు జమ్ముల శ్రీనివాస్‌రెడ్డి, ఉపేందర్‌రెడ్డి, ఎల్లయ్య, అప్పాల ప్రవీణ్‌, సంతోష్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, ఆంజనేయులు, కనకయ్య, మైసయ్య తదితరులు పాల్గొన్నారు.
ములుగులో..
ములుగు: మెదక్‌ పార్లమెంట్‌ ఉప ఎన్నికల్లో పోటీచేసిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి గెలుపుతో మండలంలోని ఆయా గ్రామాల్లో టీఆర్‌ఎస్‌ శ్రేణులు మంగళవారం ఘనంగా సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మండల యూత్‌ విభాగం అధ్య క్షులు భట్టు అంజిరెడ్డి మాట్లాడుతూ కేపీఆర్‌ విజయం వెనుక జిల్లా ప్రజల సహకారం ఎంతగానో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మండల టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.
తూప్రాన్‌లో ..
తూప్రాన్‌: టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించడంతో మంగళవారం తూప్రాన్‌ పట్టణంలో టీఆర్‌ఎస్‌ శ్రేణులు విజయోత్సవ సంబురాలు ఘనంగా నిర్వహించారు. మెదక్‌ పార్లమెంట్‌ సభ్యుడిగా కొత్త ప్రభాకర్‌రెడ్డి విజయం సాధించినట్లు తెలియగానే తూప్రాన్‌ పట్టణంలో టీఆర్‌ఎస్‌ శ్రేణులు పంచాయతీవద్దకు చేరుకున్నారు. టపాకాయలు కాల్చి, మిఠాయిలు పంపిణీచేశారు. పెద్దపెట్టున నినాదాలు చేస్తూ తూప్రాన్‌ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఇందులో ఎంపీపీ అధ్యక్షుడు గుమ్మడి శ్రీనివాస్‌, తూప్రాన్‌ సర్పంచి చిటిమిల్ల శివ్వమ్మ, మాజీ సర్పంచి కమ్మరి సత్యనారాయణ, టీఆర్‌ఎస్‌ నాయకులు శ్రీశైలంగౌడ్‌, శ్రీనివాస్‌రావు, రాజేశ్వర్‌శర్మ, చంద్రారెడ్డి, ఆంజాగౌడ్‌, రవీందర్‌గుప్త, సత్తార్‌, మామిడి వెంకటేశ్‌, మెరుగు భిక్షపతి, రాజు, అచ్యుత్‌రెడ్డి, మల్లేశ్‌ తదితరులు పాల్గొన్నారు.
దౌల్తాబాద్‌ మండలంలో..
దౌల్తాబాద్‌: టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి విజయం సాధించడంతో దౌల్తాబాద్‌ మండలంలోని పలు గ్రామాల్లో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నాయకులు సంబురాలు జరుపు తూ బాణసంచా పేల్చారు.
ఈ సందర్భంగా జడ్పీటీసీ సరువుగారి వీరమణిభూపాల్‌రెడ్డి, ఎంపీపీ అధ్యక్షురాలు అబ్బ గాని మంగమ్మ రామదాసుగౌడ్‌, దౌల్తాబాద్‌ సర్పంచ్‌ ఆదివేణు, దొమ్మాట సర్పంచ్‌ మోహన్‌రావు, గాజులపల్లి సర్పంచ్‌ మాధవిచంద్రం, టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు రణం శ్రీనివాస్‌గౌడ్‌, యూత్‌ అధ్య క్షులు నర్ర సత్యంలు మాట్లాడుతూ కేపీ ఆర్‌కు 3లక్షల 61వేల పైచిలుకు ఆధిక్యం కట్టబెట్టడం వందరోజుల్లో టీఆర్‌ఎస్‌ చేసిన అభివృద్ధిపై నమ్మకంతోనే అన్నారు.
ఈ కార్యక్రమంలో నాయకులు నర్సింహ్మారెడ్డి, ఆదివెంకన్న, పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
వర్గల్‌లో ..
వర్గల్‌ : మెదక్‌ పార్లమెంట్‌ ఉప ఎన్నికలలో టీఆర్‌ఎస్‌ భారీ మెజార్టీతో విజయం సాధించడంతో మండల కేంద్రమైన వర్గల్‌ జడ్పీటీసీ పోచయ్య అద్వర్యంలో టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు మంగళవారం స్వీట్లు పంచుకుని, టపాసులు కాల్చుతూ ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. అలగే మండల పరిధిలోని గౌరారం, పాములపర్తి, నెంటూర్‌, మజీద్‌పల్లి, నాచారం, వేలూర్‌, తున్కిఖాల్సా, మినాజీపేట, అంబర్‌పేటలో టీఆర్‌ఎస్‌ శ్రేణులు సంబరాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నాయకులు ఎండీ ఫారుఖ్‌, రంగారెడ్డి, ప్రవీన్‌, నాగరాజు, ఆటో యూనియన్‌ నాయకులు యాదగిరి, చాన్‌పాష, కుమార్‌, తదితరులు ఉన్నారు.