Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 16 2014 @ 22:31PM

కళ్ల ఆరోగ్యానికి...

శరీరంలోని అన్ని భాగాల్లోకెల్లా కళ్లు చాలా ముఖ్యమైనవి. అలాంటి కళ్లు అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని రకాల ఆహారపదార్థాలను, కాయగూరలను మనం నిత్యం తప్పనిసరిగా తీసుకోవాలి. అవేమిటంటారా? ఇవే....
కళ్ల పేరు చెప్తే వెంటనే గుర్తుకువచ్చేవి కేరట్‌లు. ఆరోగ్యకరమైన కళ్లకు కేరట్‌లు చాలా అవసరం. కంటికి అవసరమైన విటమిన్‌-ఎ, బీటాకెరొటిన్‌లు వీటిలో పుష్కలంగా ఉంటాయి. కంటి పైభాగం, రెప్పలకు విటమిన్‌-ఎ ఎంతో అవసరం. కంటిలోని కణజాలం దెబ్బతినకుండా బీటాకెరొటిన్‌ సాయపడుతుంది. పైగా ఇది శక్తివంతమైన యాంటాక్సిడెంట్‌ కూడా. కాటరాక్టు, మాక్యులర్‌ డీజెనరేషన్‌ నుంచి ఇవి కళ్లను కాపాడతాయి. దీన్లో పుష్కలంగా ఉండే పొటాషియం, పీచుపదార్థాలు కూడా శరీరారోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కేరట్‌ తినడం వల్ల జీర్ణవ్యవస్థ సైతం సరిగా పనిచేస్తుంది. కేరట్స్‌లో ఉన్న ఫాల్కారినోల్‌ అన్న పదార్థం కేన్సర్‌ కణాల వృద్ధిని నియంత్రిస్తుంది. శరీర బరువు తగ్గాలనుకుంటే కూడా కేరట్‌లను బాగా తినాలి. ఇవి జిహ్వచాపల్యాన్ని సైతం నియంత్రిస్తాయి.
.  సాల్మన్‌ చేపలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ మెండుగా ఉంటాయి. ఇవి కళ్లను ఎంతో ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ చేపను నిత్యం తినడం వల్ల మాక్యులర్‌ డీజెనరేషన్‌ రిస్కు ఉండదు. కళ్లను పొడిబారేట్టు చేసే జబ్బును సైతం ఇది తగ్గిస్తుంది. ఈ చేపలోని విటమిన్‌-డి కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. గుండె జబ్బులను నియంత్రిస్తుంది. సాల్మన్‌ చేప తినడం వల్ల ఎముకలు ఆరోగ్యవంతంగా ఉంటాయి. విటమిన్‌- డి లోటు వల్ల కేన్సర్‌, టైప్‌-1 డయాబెటిస్‌, గుండెజబ్బులు, రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌, సిలరోసిస్‌ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే రోజూ సాల్మన్‌ని తింటే కళ్లు ఆరోగ్యంగా ఉండడమే కాదు విటమిన్‌- డి లోటును కూడా తగ్గించవచ్చు. సాల్మన్‌లోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ కొలెసా్ట్రల్‌ని తగ్గిస్తుంది. కడుపులో మంటను నిరోధిస్తుంది. అల్జీమీర్స్‌ వ్యాధి రాకుండా కాపాడుతుంది. వారంలో కనీసం రెండుసార్లు తప్పనిసరిగా సాల్మన్‌ చేపల కూర తినాలి. నిద్రలేమితో బాధపడే వాళ్లు కూడా ఈ చేపను తింటే మంచిది. రోజూ రాత్రి ఈ చేపలను తింటే వీటిల్లోని ట్రిప్టోఫాన్‌ సహజసిద్ధమైన మత్తుమందుగా పనిచేసి నిద్ర బాగా పడుతుంది.
.  ఆకుకూరలు కూడా కంటికిఎంతో మంచివి. ఆకుకూరల్లో ఉండే యాంటాక్సిడెంట్ల వల్ల కంటి చూపు దెబ్బతినదు. కాటరాక్టు వంటి కళ్ల జబ్బులేవీ కూడా రావు. పైగా ఆకుకూరలు రెటీనాని సైతం ఎంతో ఆరోగ్యంగా ఉంచుతాయి. ఆకుకూరలు శరీరారోగ్యానికి సైతం సంజీవనిలా పనిచేస్తాయి. ఉదాహరణకు పాలకూర మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. డెమెన్షియా లాంటి జబ్బులను దరిచేరనీయదు.
.  మొక్కజొన్నలో శక్తివంతమైన యాంటాక్సిడెంట్లు బోలెడు ఉన్నాయి. నిత్యం మొక్కజొన్నలు తినడం వల్ల కాటరాక్టును నిరోధించవచ్చు. మొక్కజొన్నల్లోని యాంటాక్సిడెంట్లు, జింక్‌, మాంగనీసు, కాపర్‌ వంటివి కేన్సర్‌ కణాలు పెరగకుండా నిరోధిస్తాయి. మొక్కజొన్నలో ఎక్కువ పీచుపదార్థం ఉండడం వల్ల పెద్దపేగు కేన్సర్‌, డయాబెటిస్‌, గుండెజబ్బులు వచ్చే అవకాశం తక్కువ. మొక్కజొన్నలోని పీచుపదార్థం వల్ల బరువు కూడా తగ్గొచ్చు.
.  ఆహారపదార్థాల్లోని న్యూట్రియంట్స్‌ను శరీరం గ్రహించేట్టు ఆలివ్‌ ఆయిల్‌ చేస్తుంది. దీంతో కళ్లు ఎంతో ఆరోగ్యకరంగా ఉంటాయి. పైగా ఆలివ్‌ ఆయిల్‌లో కొలెసా్ట్రల్‌ గాని, కార్బొహైడ్రేట్లు గానీ ఉండవు. ఇందులో విటమిన్‌-ఇ పుష్కలంగా ఉంటుంది.
.  టొమాటోల్లో కార్టినోయిడ్స్‌ బాగా ఉంటాయి. ఇందులో యాంటాక్సిడెంట్లు కూడా ఎక్కువే. టొమాటోల్లోని లైకొపెనె రెటినాను సంరక్షిస్తుంది. వెలుతురు వల్ల వచ్చే కంటిజబ్బుల నుంచి కాపాడుతుంది. అంతేకాదు ఊపిరితిత్తులు, ప్రొస్టేట్‌, స్టొమక్‌ కాన్సర్‌లు సోకకుండా రక్షిస్తుంది. టొమాటోల్లో విటమిన్‌-సి కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి చూపును ఎంతగానో సంరక్షిస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని కాపాడడమే కాదు రోగనిరోధకశక్తిని పెంచుతాయి. మెదడు చురుగ్గా పనిచేసేట్టు చేస్తాయి. గాయాలను తొందరగా మాన్పుతాయి.
.  చిలగడదుంపలు కూడా కళ్లకు చాలా మేలుచేస్తాయి. కేరట్‌లలో లాగే వీటిల్లో కూడా బీటాకెరొటిన్‌, విటమిన్‌- ఎ, విటమిన్‌- సి, పీచుపదార్థం, మాంగనీసు, పొటాషియంలాంటివి ఎక్కువగా ఉన్నాయి. విటమిన్‌- డి కూడా పుష్కలంగా ఉంది. ఇది రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది. వీటిల్లోని విటమిన్‌-బి6, పొటాషియంలు రక్తపోటును నియంత్రిస్తాయి. గుండెజబ్బుల బారిన పడకుండా కాపాడతాయి.