
గుంటూరు : అతడో తెలుగు మా స్టారు. పెళైంది. ఇద్దరు పిల్లలు. ఐతే నేం.. శృంగార నైషథాన్ని, వాత్సాయన కామసూత్రాలను వంట పట్టించుకున్నాడు. ఇంతలో ఆ బడికి పెళ్ళికాని అమాయక టీచరమ్మ రాకతో ఇతగాడిలో అంతర్లీనంగా దాగిన కీచకుడు నిద్ర లేచాడు. నిత్యం ఆ యువతికి నర్తనశాల చూపించటం మొదలెట్టాడు. తన కోరిక తీర్చక పోతే యాసిడ్ పోస్తాననే స్థాయికి చేరుకున్నాడు. ఇంత కాలం ఈ దాష్టీకాన్ని మౌనంగా భరించిన బాధితురాలు చివరకు పోలీసుల గ్రీవెన్స్‌లో రూరల్ అదనపు ఎస్పీ రామాంజనేయులుకు ఫిర్యాదు చేసి...కన్నీళ్ళు పెట్టుకున్న వైనం ఇది. బాధితురాలి కథనం ప్రకారం, నిజాంపట్నం ప్రాంతానికి చెందిన ఓ యు వతి 2008లో సెకండరీ గ్రేడ్ టీచర్‌గా ఎంపికయ్యారు. నూజండ్ల మండలం లోని ఓ ఎంిపీయూపీ స్కూల్లో నాలుగేళ్ళుగా పని చేస్తున్నారు. అదే స్కూల్లో బీ శ్రీనివాసరావు తెలుగు పండిట్‌గా పని చేస్తున్నాడు. శ్రీనివాసరావుకు వివాహమై ఇద్దరు సం తానం ఉన్నారు. ఈ యువతి వినుకొండ నుంచి ప్రతి రోజు ఆటోలో స్కూల్‌కు వెళ్లి వచ్చేది. అదే ఆటోలో తెలుగు పండిట్ కూడా స్కూల్‌కు వెళ్తుంటాడు. ఆటోలోనూ వికృత చేష్టల తో శునకానందం పొందేవాడు. ఈ విషయాలను బయటకు చెబితే తన పరువు పోతుందనే భయంతో మిన్నకుండి పోయేది. దీన్ని అలుసుగా తీసుకున్న తెలుగు మాస్టారు తన కోరిక తీర్చకుంటే యాసిడ్ పోసి చంపేస్తానని బెదిరించటం మొదలెట్టాడు. తనకు పలుకుబడి ఉందని, ఈ విష యం ఎవరికి చెప్పినా ప్రాణాలతో ఉం డవంటూ హెచ్చరించాడు. గత్యంతరం లేని పరిస్థితుల్లో అదనపు ఎస్పీకి ఫిర్యాదు చేసింది.