Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 16 2014 @ 04:28AM

జొహరాపురం సమస్యలు పరిష్కరించాలి

కర్నూలు (కార్పొరేషన్‌): నగరంలోని 20 వ వార్డు పరిధిలోని జొహరాపురంలో సమస్య లు పరిష్కరించాలని సీపీఎం నాయకులు, మాజీ కార్పొరేటర్‌ రాముడు, పార్టీ జోన్‌ కార్యదర్శి రాజశేఖర్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారులు, ప్రజా ప్రతినిధులు సమస్యలు విస్మరిస్తున్నారన్నారు. చెన్నకేశవ వీధిలో మంచినీటి పైపులైన్‌ విస్తరించాలని ఎంతో కాలంగా కోరుతున్నా ఎవ్వరూ స్పందించడం లేదన్నారు. కాలనీలోని ఆటో స్టాండ్‌ నుంచి కల్లుపెంట వరకు రోడ్డుపై తవ్విన గోతులు పూడ్చలేదన్నారు. ఐద్వా జిల్లా నాయకులు నిర్మలమ్మ మాట్లాడుతూ మహిళలను లక్షాధికారులు చేస్తామని అధికారంలోకి వచ్చి న టీడీపీ ప్రభుత్వం మహిళా సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తోందని విమ ర్శించారు. నేతాజీ నగర్‌లో మహిళలకు మరుగుదొడ్లు, తగిన నీటి వసతి ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం పలు సమస్యలను మున్సిపల్‌ కమిషనర్‌ పీవీవీఎస్‌ మూర్తికి వా రు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రంగస్వామి, దాసు, నాగరాజు, ఉరుకుందు, ఇమ్రాన్‌,మునిస్వామి, మహిళలు పాల్గొన్నారు.