Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 16 2014 @ 04:28AM

హామీలు నెరవేర్చడంలో టీడీపీ వైఫల్యం

వందరోజుల పాలనలో వంద అబద్ధాలు
సీఎం చంద్రబాబు ఉద్యోగుల వ్యతిరేకి
కమిటీలతోనే కాలయాపన డీసీసీ అధ్యక్షుడు
బీవై రామయ్య

కర్నూలు (న్యూసిటీ): ముఖ్యమంత్రిగా ఆర్భా టంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో చంద్రబాబునాయుడు విఫలమయ్యారని డీసీసీ అధ్యక్షుడు బీవై రామయ్య ఆరో పించారు. సోమవారం కాంగ్రెస్‌ కార్యాలయంలో ఎమ్మెల్సీ సుధాకర్‌బాబు, మాజీ జడ్పీ ఆకెపోగు వెం కటస్వామి, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు టీడీపీ ప్రభుత్వం వందరోజుల పాలనపై ఏపీ కాంగ్రెస్‌ కమిటీ తయారు చేసిన డాబుల బాబు - వందరోజుల పాలనపై వాస్తవ పత్రాన్ని విలేఖరులకు చూపించారు. ఈ సందర్భంగా బీవై రామయ్య మాట్లాడుతూ టీడీపీ వందరోజుల పాలనను బ్లాక్‌డేగా గుర్తించుకోవాలన్నారు. సీఎంగా మొట్టమొదటి సంతకానికే ఇం త వరకు దిక్కులేకుంటే ఇక పరిపాలన ఎలా చేస్తారని ప్రశ్నించారు. వందరోజుల పాలనలో ఎన్నో చే శామని సంబరాలు చేసుకుంటున్న టీడీపీ శ్రేణులు వంద అబద్ధ్దాలతో ప్రజలను మోసం చేసిన సంగతి గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు. కోటయ్య కమిటీ, పినుఫుల కమిటీ, రీ షెడ్యూల్‌ కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని, శివరామక్రిష్ణన్‌ ఇచ్చిన కమిటీ నివేదికను పరిగణలోకి తీసుకోకుం డా రాజధానిని విజయవాడలో ప్రకటిం చారని ఆ రోపించారు. రైతుని నిట్టనిలువునా ముంచి మోసం చేసిన వ్యక్తిగా చంద్రబాబు చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. సుధాకర్‌బాబు మాట్లాడుతూ సీఎం పూర్తిగా ఉద్యోగుల వ్యతిరేకి అన్నారు. ఉద్యో గులను క్రమబద్ధ్దీకరిస్తానంటూ మండలిలో ఇచ్చిన మాటను పట్టించుకోవడం లేదని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తే అందులో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్‌ కల్పించాలన్నారు. ఈ సమావేశంలో వే ణుగోపాల్‌రెడ్డి, ఐఎన్‌టీయూసీ రమణ, ఖలీల్‌బాషా పాల్గొన్నారు.