Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 16 2014 @ 04:21AM

ఏబీఎన్‌ ప్రసారాలు పునరుద్ధరించాలని పీఎంకు పోస్టు కార్డులు

హుజూర్‌నగర్‌ : తెలంగాణ రాష్ట్రంలో ఏబీఎన్‌, టీవీ 9 ప్రసారాలను పునరుద్ధరించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సోమవారం టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో పోస్టు కార్డులను పంపారు. ఈసందర్భంగా టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సోమగాని నరేందర్‌ మాట్లాడుతూ కేసీఆర్‌, ఎంఎస్‌ఓలు మీడియా సంస్థలపై కక్షసాధింపు చర్యలకు దిగటం శోచనీయమన్నారు. ఎస్‌ఎం ఓలు తక్షణమే ప్రసారాలను కొనసాగించాలని డి మాండ్‌ చేశారు. కార్యక్రమంలో జలగం రాము, దేవిశెట్టి వేణు, జగన్‌, శ్రీనివాసరెడ్డి, దాసరి సతీష్‌, పృథ్వి, మహేష్‌, గోపి, సాయికృష్ణ పాల్గొన్నారు.
విద్యార్ధులసమస్యలు పరిష్కరించాలి : టీఎన్‌ఎస్‌ఎఫ్‌
విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరి ష్కరించాలని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యనిర్వాహక కా ర్యదర్శి సోమగాని నరేందర్‌గౌడ్‌ కోరారు. సోమవారం పట్టణంలోని ప్రభుత్వ ప్రాథమికోన్న పాఠశాల ఆవరణ లో టీఎన్‌ఎస్‌ఎఫ్‌ కరపత్రాని ఆవిష్కరించారు. పాఠశాలల్లో మౌళిక వసతులు ఏర్పాటు చేయాలని ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులను భర్తీచేయాలని కోరారు. సమావేశంలో రాము, వేణు, జగన్‌, శ్రీనివాసరెడ్డి, సతీష్‌, పృద్ధి, గోపి, సాయికృష్న, జగదీష్‌ పాల్గొన్నారు.