desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 16 2014 @ 04:18AM

పీహెచ్‌సీ ఎదుట ఆందోళన

యాదగిరిగుట్ట రూరల్‌: వైద్యుల నిర్లక్ష్యంతో పురిట్లోనే బిడ్డ చనిపోయిందని యాదగిరిగుట్ట మండలం కొత్తగుండ్లపల్లి గ్రామస్థులు సోమవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట ధర్నా చేశారు. బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.... యాదగిరిగుట్ట గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్తగుండ్లపల్లి గ్రామానికి చెందిన కొమ్మురాజుల వేములయ్య భార్య నీలమ్మను మొదటి కాన్పు చేయించేందుకు ఆదివారం రాత్రి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేరింది. రాత్రి 2గంటల సమయంలో పురిటి నొప్పులు రావడంతో స్టాఫ్‌నర్సు చికిత్స చేశారని, దీంతో ప్రసవం సులభం కాకుండా పిండం అడ్డం తిరిగి చనిపోయిందని నీలమ్మ భర్త వేములయ్య తెలిపారు. వైద్యులకు సమాచారమివ్వలేదని, భార్యను భువనగిరికి తీసుకెళ్తానని చెప్పినప్పటికీ వినకుండా జాప్యం చేసిందన్నారు. తనకు న్యాయం చేయాలని సంబంధిత జిల్లా స్థాయి అధికారులను కోరారు. అంతకు ముందు స్థానిక పోలీస్‌స్టేషన్‌, తహసీల్దార్‌లకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఈ విషయమై వైద్యాధికారి మాట్లాడుతూ ప్రసవం సమయంలో తమ సిబ్బంది అన్ని విధాలుగా వైద్య సేవలందించి చికిత్స చేశారని, తల్లిగర్భంలో మెకోమియం విస్తరించడంతో చనిపోయిందన్నారు. సంఘటనకు కారణమైన బాధితులపై చర్యలు తీసుకోవాలని బాధితులు ధర్నా చేయటంతో స్థానిక పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనను విరమింపజేశారు.