Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 16 2014 @ 02:28AM

ఎర్రచందనం అమ్మకంపై ఉలిక్కిపడుతున్న ఇంటి దొంగలు


ప్రొద్దుటూరు పుట్టపర్తి సర్కిల్‌: రాష్ట్ర ప్రభుత్వం అటవీ శాఖ గోడౌన్లలోని ఎర్రచందనం నిల్వలను అమ్మకానికి పెట్టడంతో ఆ శాఖకు చెందిన జిల్లాలోని కొంతమంది అధికారులు ఉలిక్కిపడుతున్నారు. జిల్లాలోని ముఖ్యంగా ప్రొద్దుటూరు డివిజన్‌లోని కొన్ని అటవీశాఖ గోడౌన్లలో నుంచి ఇంటి దొంగలు ఎర్రచందనం నిల్వలను మాయం చేశారు. బయటకు తరలించి అమ్ముకున్నారు. దీన్ని ఆశాఖ ఉన్నతాధికారులు గుర్తించారు. గతంలో కొంతమంది ఇంటి దొంగలపై వేటు వేశారు. అధికారులకు పట్టుబడిన కొన్ని ఎర్రచందనం దుంగలపై ఉన్న నంబర్లను బట్టి అవి గతంలోపట్టుబడిన అటవీశాఖ గోడౌన్లలో నిల్వ పెట్టిన దుంగలుగా అధికారులు గుర్తించారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎర్రచందనం నిల్వల అమ్మకానికి టెండర్లు పిలిచింది. దాంతో రికార్డులలోని ఎర్రచందనం నిల్వలకు గోడౌన్లలోని ఎర్రచందనం నిల్వలకు పొంతన ఉండకపోవడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై కొంతమంది కిందిస్థాయి అధికారులు ఉద్యోగులు ఉలిక్కి పడుతున్నారు. ఇటీవల పట్టుబడిన ఎర్రచందనం దుంగలను కొంతమంది కిందిస్థాయి అధికారులు తక్కువగా చూపిస్తున్నారు. మిగతా దుంగలను రికార్డులోని లెక్కల తేడాకు సర్దుబాటు చేస్తున్నారు. ఇటీవల ప్రొద్దుటూరు డివిజన్‌లో లారీలో పెద్ద సంఖ్యలో దుంగలు పట్టుబడగా ఎక్కువ శాతం పక్కనపెట్టి తక్కువగా చూపించడాన్ని ఆశాఖ ఉద్యోగులే తప్పు పడుతున్నారు.