desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 16 2014 @ 02:05AM

గ్రీవెన్స్‌ కిటకిట


అనంతపురం,కలెక్టరేట్‌ : జిల్లా గ్రీవెన్స్‌ ఫిర్యాదుదారులతో కిటకిట లాడింది. జిల్లా నలుమూలల నుంచిపలు సమస్యలపై బాధితులు క్యూకట్టారు. కలెక్టర్‌ సొలమన్‌ ఆరోగ్యరాజ్‌ ఎదుట తమ ఆవేదనను వెలిబుచ్చారు. మొత్తం 348 మంది తమ తమ సమస్యలపై అర్జీలు సమర్పించారు. కలెక్టర్‌ సొలమన్‌ ఆరోగ్యరాజ్‌, జేసీ సత్యనారాయణ, డీఆర్‌ఓ హేమసాగర్‌, డీఆర్‌డీఏ,డ్వామా పీడీలు నీలకంఠారెడ్డి, సంజయ్‌ప్రభాకర్‌, హౌసింగ్‌ పీడీ ప్రసాద్‌, ఎస్సీ కార్పోరేషన్‌ ఈడీ జనార్థన్‌రావు తదితరులు అర్జీలు స్వీకరించారు.
అందులో కొన్ని వినతులిలా...
- జిల్లా కేంద్రంలో ఉర్దూ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని ఐఎంఎం అధ్యక్షుడు మహబూబ్‌బాషా, కార్యదర్శి జిలాన్‌ బాషా,నూర్‌ బాషాలు,లాలూసాబ్‌లు కలెక్టర్‌ను కోరారు. జిల్లాలోని ముస్లిం విద్యార్థినీ, విద్యార్థులు ఉర్దూ కళాశాల లేనందున పొరుగు జిల్లాలకు వెళ్లాల్సి వస్తోందన్నారు. దీన్ని పరిగణలోకి తీసుకొని ముస్లిం విద్యార్థుల సౌకర్యార్థం ఇక్కడే కళాశాలను ఏర్పాటు చేయాలని కోరారు.
- ఫిష్‌ సొసైటీ లో తమను సభ్యులుగా చేర్చినట్లు అధికారులు ప్రకటించినా తమతో సభ్యత్వం చేయించుకోవడంలేదని పరిగి గ్రామస్తులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారించి తనకు న్యాయం చేయాలని కోరారు.
- తమకు చెందిన భూమిని ఇతరులు ఆక్రమించి తమను భూమిలోకి వెళ్లకుండా బెదిరిస్తున్నారని అనంతపురం రూరల్‌ మం డలం కట్టకింద పల్లికి చెందిన రామన్న,వన్నూరమ్మలు కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లారు. 2001 లో నిరుపేదలమైన తమకు ప్రభుత్వం తరపు న ఆ భూమిని ఇచ్చి పట్టా మంజూరు చేశారన్నారు. అయితే కొందరు ధైర్జన్యకారులు తా ము సాగులో ఉన్న భూమిలోకి తమను వెళ్లనీవకుండా బెదిరిస్తున్నారన్నారు. దీనిపై విచారించి తమకు న్యాయం చేయాలని కోరారు. ;ి:థీ9తీొజూగ్ఞూ