desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 16 2014 @ 01:50AM

మట్టి రోడ్లతో అవస్థలు


కరీంనగర్‌ అర్బన్‌ : కరీంనగర్‌ పరిపాలనా భవనం ఎదుట ఉన్న 31వ డివిజన్‌లో అన్నీ సమస్యలే. పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వంతో డివిజన్‌ పరిధిలో అభివృ ద్ధి జాడే లేకుండా పోయింది. ప్రజలకు కనీస మౌలిక వసతులు కరువయ్యాయి. డివిజన్‌ పరిధిలో రెవెన్యూక్లబ్‌ ప్రాంతం, భగత్‌నగర్‌, రాంచంద్రాపూర్‌ కాలనీ, జడ్పీ, పోలీసు క్వార్ట ర్స్‌ ప్రాంతం, పెద్దమ్మ గుడి, సెంట్రల్‌వేర్‌హౌజ్‌ ప్రాంతాలున్నాయి. డివిజన్‌లో మొత్తం జనాభా 9 వేల వరకు ఉండగా ఓటర్లు 5,600లున్నారు. చాలా ప్రాంతాల్లో మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది. డివిజన్‌లోనే మంచినీటి రిజర్వాయర్‌ ఉన్నప్పటికీ నల్లాల ద్వారా అందించే తాగు నీరు సమృద్ధిగా అందడం లేదు. రెండు రోజులకు ఒక సారి మాత్రమే సరఫరా అయ్యే తాగునీరు గంట కూడా రావటం లేదని మహిళలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పాత పైపులైన్లకు సామర్యాథ్యనికి మించి కనెక్షన్లు ఇవ్వడం ద్వారా నీటి సరఫరా సమయంలో ప్రెషర్‌ రావడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. డివిజన్‌లో చాలా ప్రాంతాల్లో మట్టి రోడ్లే దర్శనమిస్తున్నాయి. ఇరుకు గల్లీలలో పారిశుధ్య చర్యలు సజావుగా నిర్వహించడం లేదు. మురికి కాలువల్లో చెత్త పేరుకు పోతుండటంతో దోమలు అధికమయ్యాయి. దీంతో స్థానిక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. సెంట్రల్‌ వేర్‌హౌజ్‌ మూలం గా పురుగులు అధికమయ్యాయి. గోదాంలో బియ్యం నిలువగా ఉంచడంతో లక్క పురుగుల బెడద తీవ్రంగా ఉంది. ఇళ్లల్లోకి లక్క పురుగులు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్నాయి. గోదాం పరిసర ప్రాంత ప్రజలు తీవ్ర ఒబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ గోదాంను ఇక్కడి నుంచి తరలించాలని స్థానికులు పలు మార్లు అధికారులకు విన్నవించినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటున్నారు. డివిజన్‌ పరిధిలో ప్రముఖమైన ఐదు దేవాలయాలున్నాయి. ఈ దేవాలయాల్లో భక్తుల సౌకర్యార్థం మంచినీటి, ఇతర మౌలిక వసతులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇప్పటికైనా స్థానిక సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. పాషా త×థచీశ్ర్గీ÷