Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 16 2014 @ 01:48AM

రేపటి నుంచి ఐసెట్‌ కౌన్సెలింగ్‌


ఆంధ్రజ్యోతి, కరీంనగర్‌ సిటీ: ఐసెట్‌ 2014 ఎంట్రెన్స్‌ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థు లు కింద తెలిపిన ర్యాంకుల వారీగా సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు హాజరు కావాలని ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ బి మధుసూదన్‌ రెడ్డి, కో-ఆర్డినేటర్‌ పి నితిన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 17న 12501-25000 ర్యాంకు వరకు, 18న 37501-50000ల వరకు, 19న 62501-75000ల వరకు, 20న 87501-100000 వరకు, 21న 1,08,001 నుంచి చివరి ర్యాంకు వరకు కౌన్సిలింగ్‌ జరుగుతుందని పేర్కొన్నారు.
సర్టిఫికెట్ల వివరాలు..
ఐసెట్‌కు కౌన్సెలింగ్‌ హాజరయ్యే విద్యార్థులు ఐసెట్‌ ర్యాంకు కార్డు, ఐసెట్‌ హాల్‌ టికెట్‌, డిగ్రీ మెమో, ప్రొవిజనల్‌ సర్టిఫికెట్‌, ఇంటర్మీడియట్‌ మార్క్స్‌ మెమో, ఎస్‌ఎస్‌సి/సీబీఎస్‌ఇ సర్టిఫికె ట్‌, 9వ తరగతి నుంచి డిగ్రీ వరకు స్టడీ సర్టిఫికెట్‌, 1 జనవరి 2014 తర్వాత తీసిన ఆదాయం సర్టిఫికెట్‌, కులం సర్టిఫికెట్స్‌, రెండు కాపీల జిరాక్స్‌ సెట్లు తీసుకొని రావాలని పేర్కొన్నారు.
ఫీజు వివరాలు..
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ. 300, బీసీ, ఓబీసీ, మైనార్టీ విద్యార్థులకు రూ. 600 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని, కౌన్సిలింగ్‌ ఉదయం 9 గంటల నుంచి జరుగుతుందని తెలిపారు. ఎస్‌ఆర్‌ఆర్‌ డిగ్రీ కళాశాల, ఉమెన్స్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలో కౌన్సిలింగ్‌ ఉంటుందని, ఎస్టీ విద్యార్థులు ఉమెన్స్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలో మాత్రమే హాజరు కావాలని, స్పోర్ట్స్‌, ఎన్‌సీసీ, సీఏపీ, పీహెచ్‌ కేటగిరీ విద్యార్థులు తమ సర్టిఫికెట్లను సాంకేతిక విద్యాభవన్‌, మసాబ్‌ ట్యాంకు, హైదరాబాద్‌నందు మాత్రమే వెరిఫై చేసుకోవాలని తెలిపారు.
ఆప్షన్లు పెట్టుకునే తేదీలు..
ఈనెల 20, 21న 1 నుంచి 60,000ల ర్యాం కు వరకు, 22, 23వ తేదీల్లో 600001 నుంచి లాస్ట్‌ వరకు ఆప్షన్లు పెట్టుకోవాలని, 24వ తేదీన ఆప్షన్లు మార్చుకోవాలని తెలిపారు. వివరాల కోసం జ్ట్టిఞ:జీఛ్ఛ్టి.ుఽజ్టీ.జీుఽ వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవాలని సూచించారు. కరీం నగర్‌ పట్టణ విద్యార్థులు మధ్యాహ్నం 2 గంట లకు కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని కోరారు.