desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 17 2016 @ 06:14AM

అద్దెకు ఇచ్చిన ఇంట్లోనే చోరీ

  • యజమానిసహా ముగ్గురు నిందితుల అరెస్టు
  • 18 తులాల బంగారు ఆభరణాలు, 550 గ్రాముల వెండి వస్తువులు, రూ. 2 లక్షలు స్వాధీనం
అడ్డగుట్ట: అద్దెకు ఇచ్చిన ఇంట్లోనే చోరీ చేసి తప్పించుకు తిరుగుతున్న యజమానిసహా ముగ్గురు నిందితులను చిలకలగూడ పోలీసులు అరెస్టు చేశారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నార్త్‌జోన్‌ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి వివరాలను వెల్లడించారు. చిలకగూడ శ్రీనివాస్‌నగర్‌కు చెందిన మహ్మద్‌ నైసర్‌ ఆన్సారీ చిన్నా చితిక వ్యాపారాలు చేస్తుండేవాడు. జల్సాలకు అలవాటు పడి రేస్‌ గుర్రాలకు డబ్బు ఖర్చు చేసేవాడు. చేతిలో డబ్బు లేకపోవడంతో చోరీలబాట పట్టాడు. తన ఇంట్లోనే అద్దెకు ఉంటున్న దేవి ఎగ్జిబిషన్‌కు వెళ్లడం గమనించిన అన్సారీ ఈనెల 11న ఇంటి తాళం పగులగొట్టి 18 తులాల బంగారు ఆభరణాలు, రూ. 2 లక్షలు, 550 గ్రాముల వెండి వస్తువులను చోరీ చేశాడు.  బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. జల్సాలకు అలవాటు పడిన అన్సారీని ప్రశ్నించగా నేరం చేసనట్టు అంగీకరించాడని తెలిపారు. అతడికి సహకరించిన మరో ఇద్దరు గులామ్‌ రసూల్‌, కాసిం అలీలను కూడా అరెస్టు చేశారు. నిందితుల నుంచి నగలు, నగదు స్వాధీనం చేసుకుని ముగ్గురినీ రిమాండ్‌కు తరలించారు.