Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 17 2016 @ 03:20AM

అమెరికా కరెన్సీపై ‘దేవుడు’ ఎందుకు?

  • కోర్టుకెక్కిన 41 మంది నాస్తికులు
వాషింగ్టన్‌: అమెరికా కరెన్సీ నోట్లపై ‘ఇన్‌ గాడ్‌ వుయ్‌ ట్రస్ట్‌’ అని ఉంటుంది. అంటే.. ‘దేవుడిపై మాకు నమ్మకం ఉంది’ అని అర్థం. తాజాగా అమెరికాలోని శాక్రమెంటోకు చెందిన మైకేల్‌ న్యూడౌ అనే లాయరు.. కరెన్సీ కాగితాలపై ఆ వాక్యాన్ని తొలగించాలంటూ కోర్టుకెక్కారు. తనలాంటి 41 మంది నాస్తికుల తరఫున ఆయన లాసూట్‌ను దాఖలు చేశారు. కాయిన్లు, కరెన్సీ నోట్లపై ఆ వాక్యాన్ని ముద్రించడమంటే.. దేవుడిపై నమ్మకంలేనివారి రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించడమేనని అందులో పేర్కొన్నారు.