Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 17 2016 @ 02:08AM

పెట్రోల్ ధరల స్వల్ప తగ్గింపు

  • పెట్రోలు 34 పైసలు, డీజిల్‌ 93 పైసలు తగ్గుదల
  • ఎక్సైజ్‌ సుంకం మరోసారి పెంపు
న్యూఢిల్లీ/హైదరాబాద్‌ సిటీ, జనవరి 16(ఆంధ్రజ్యోతి): పెట్రోల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గిన నేపథ్యంలో పెట్రోలు, డీజిల్‌ ధరలను తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లో పెట్రోలు ధర 34 పైసలు తగ్గగా, డీజిల్‌ ధర 93 పైసలు తగ్గింది. దీంతో లీటరు పెట్రోలు ధర రూ.64.24 నుంచి రూ.63.90కు, డీజిల్‌ ధర రూ.49.11 నుంచి 48.18కి తగ్గాయి.ఈ తగ్గుదల శుక్రవారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చింది. అయితే పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్‌ సుంకాన్ని ప్రభుత్వం మరోసారి పెంచింది. ముడి చమురు ధర బ్యారెల్‌కు సుమారు రూ.1800 తగ్గిన నేపథ్యంలో ఎక్సైజ్‌ సుంకాన్ని పెట్రోలుపై లీటరుకు 75 పైసలు, డీజిల్‌పై రూ.2 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా ఖజానాకు మరో రూ.3700 కోట్ల ఆదాయాన్ని అదనంగా రాబట్టుకోనుంది. ఎక్సైజ్‌ సుంకం పెంపు ఈ నెలలో ఇది రెండోసారికాగా గత నవంబర్‌ నుంచి నాలుగోసారి. అయితే ముడి చమురు లభిస్తున్న ధరతో పోలిస్తే ప్రభుత్వం పెట్రో ధరలను చిల్లర మాత్రమే తగ్గించిందని ప్రతిపక్ష కాంగ్రెస్‌ ఆరోపించింది. 2014 మే 26తో పోలిస్తే ప్రస్తుతం ముడి చమురు ధర 72.21 శాతం తగ్గిందని, దీని ప్రకారం పెట్రోలు ధర లీటరు రూ.19.40, డీజిల్‌ రూ.15.71 మాత్రమే ఉండాలని కాంగ్రెస్‌ ముఖ్య అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా అన్నారు.