Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 17 2016 @ 02:03AM

విద్యామండలి ఖాతాపై విచారణ వాయిదా

న్యూఢిల్లీ, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యామండలి బ్యాంకు ఖాతా స్తంభింపజేయడంపై దాఖలైన పిటిషన్‌పై తదుపరి విచారణను ఫిబవరి 18కి వాయిదావేస్తూ సుప్రీం ఆదేశాలు జారీచేసింది. ఈ పిటిషన్‌పై జస్టీస్‌ దీపక్‌ మిశ్రాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం విచారించింది. కాగా, ఉన్నత విద్యా మండలి ఖాతాను స్తంభింపజేస్తూ గతంలో హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని పిటిషన్‌లో వివరించారు. కనీసం ప్రవేశ పరీక్షల కోసం విద్యార్థులు చెల్లించిన రుసుములు కూడా తీసుకొనే వెసులుబాటు లేదని పేర్కొన్నారు. బ్యాంకు ఖాతా స్తంభింపజేయడం వల్ల ఎదురవుతున్న సమస్యలను ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది పీపీ రావు కోర్టు దృష్టికి తెచ్చారు. కాగా, తదుపరి విచారణను ఫిబ్రవరి 18కి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది.