Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 17 2016 @ 02:02AM

59 జేసీజే పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

హైదరాబాద్‌, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): జూనియర్‌ సివిల్‌ జడ్జి (జేసీజే) పోస్టుల భర్తీకి హైకోర్టు నోటిఫికేషన్‌ జారీచేసింది. 59 పోస్టులను ఇందులో భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన విధి విధానాలు వెల్లడించాల్సి ఉంది. 97 జేసీజే పోస్టుల భర్తీకి సంబంధించి 2014లో జారీచేసిన నోటిఫికేషన్‌ కింద అభ్యర్థుల ఎంపిక ఇప్పటికే పూర్తయ్యింది. కాగా 2015లో 34 జేసీజే పోస్టుల భర్తీకి ఇంటర్య్వూలు పూర్తయ్యాయి. ఫలితాలు వెల్లడించాల్సి ఉంది. కాగా తాజాగా మరో 59 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. వీటిలో 48 పోస్టులు డైరెక్టు రిక్రూట్‌మెంట్‌ద్వారా, 11 పోస్టులు బదిలీల ద్వారా భర్తీచేయనున్నారు.