Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 16 2016 @ 23:23PM

డిజిటల్‌ ప్రేమతో

మన దేశంలో ‘డిజిటల్‌ విప్లవం’ సంగతెలా ఉన్నా ‘డిజిటల్‌ లవ్‌’ మాత్రం బాగా దూసుకుపోతోంది. ఆన్‌లైన్‌ డేటింగ్‌ వెబ్‌సైట్స్‌ పుణ్యమా అని డిజిటల్‌ లవ్‌ కొత్తపుంతలు తొక్కుతోంది.

 
ఇపుడు ప్రేమలు, బంధాలన్నీ టెక్నాలజీ సాయంతో నడుస్తున్నాయి. ఫేస్‌బుక్‌ లాంటి సామాజిక వెబ్‌సైట్స్‌లో యువతీ, యువకులు కలిసి లైక్స్‌, కామెంట్స్‌, షేరింగ్స్‌ చేసుకునే క్రమంలో ప్రేమ మొలకెత్తుతోంది. ఆ తర్వాత కొందరు పెళ్లితో ఒక్కటవుతున్నారు. నేటి యువతలో మారుతున్న ఆలోచనాధోరణులను గమనించి డేటింగ్‌ యాప్స్‌ ఇప్పుడిపుడే మన దేశంలోకి అడుగిడి, రాబోయే రోజుల్లో రాజ్యమేలడానికి రెడీ అవుతున్నాయి. సకల విషయాల్నీ తనలో ఇముడ్చుకునే శక్తి యాప్స్‌కు ఉంది. అందుకే స్మార్ట్‌ఫోన్‌ యాప్స్‌ హవా నడుస్తోంది. డిజిటల్‌ లవ్‌ను మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లడానికి ‘ట్రూలీ మ్యాడ్‌లీ’ లాంటి యాప్స్‌ అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాయి మరి. ఈ యాప్‌ కేవలం ఇద్దరిని కలపటం కాదు ఒకే అభిరుచి ఉన్న ఇద్దరు మనసులను కలుపుతాం అంటోంది. అంటే యువతీ, యువకుల మధ్య మధ్యవర్తి అన్నమాట. ఈ మధ్యవర్తి రెండేళ్ల కితం నెట్టింట్లోకి వచ్చింది. ముఖ్యంగా మెట్రో యువత వల్ల ఈ యాప్స్‌ పంట పండుతోంది. పెళ్లిళ్ల పేరయ్య పాత్రను పోషిస్తోన్న ఈ డేటింగ్‌ యాప్స్‌ ఇండియాలో ట్రావెలింగ్‌ యాప్స్‌తో పోటీ పడే రోజులు భవిష్యత్తులో త్వరగా వస్తాయని సర్వేలు చెబుతున్నాయి. 2020 నాటి ప్రపంచంలోనే అత్యధిక యువత, అదీ 30 ఏళ్లలోపు వారే ఉండటం విశేషం. దీంతో పాటు భారతదేశంలో మారుతున్న సామాజిక మార్పులు వచ్చాయి. కుటుంబవ్యవస్థ బలహీనం కావటం వల్లే ఇపుడు మ్యాట్రిమొనీ వెబ్‌సైట్స్‌కు డిమాండ్‌ పెరిగింది. వీటికి లేటెస్ట్‌ వర్షెన్‌గా ‘ట్రూలీ మ్యాడ్‌లీ’ లాంటి యాప్స్‌ పుడుతున్నాయి. అందుకే ఈ డేటింగ్‌ యాప్స్‌ మన దేశంపై ప్రేమను వొలకబోస్తున్నాయి మరి.!