Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 16 2014 @ 01:41AM

నివేదికలు ఇవ్వని మాక్స్‌లకు నోటీసులు?


(ఆంధ్రజ్యోతి/విశాఖపట్నం)
జిల్లాలో మ్యూచివల్లీ ఎయిడెడ్‌ కో ఆపరేటివ్‌ సొసైటీ(మాక్స్‌)లు కార్యకలాపాలపై జిల్లా సహకార శాఖ అధికారులు దృష్టిని సారించారు. మాక్స్‌ సొసైటీల కొన్నింటి కార్యకలాపాలపై ఆరోపణలు రావడంతో వాటికి చెక్‌ పెట్టాలని జిల్లా అధికారులు భావిస్తున్నారు. దీంతో, ప్రతిఏటా కార్యకలాపాలపై వార్షిక నివేదికలు అందించని సొసైటీలకు నోటీసులను జారీ చేయడం ద్వారా దారిలోకి తీసుకురావాలని వారు తలపోస్తున్నారు. హౌస్‌ బిల్డింగ్‌ , క్రెడిట్‌ సొసైటీతోపాటు మరికొన్ని ఎలాంటి సమాచారాన్ని అందజేయకపోవడాన్ని జిల్లా అధికారులు సీరియస్‌గా పరిగణిస్తున్నారు. అటువంటి సొసైటీలు నోటీసులు జారీకి రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు జిల్లాలోని 209 మాక్స్‌లకు నోటీసులు జారీకి అవకాశం ఉన్నట్టు తెలిసింది.
గతంలో సహకార శాఖలో పనిచేస్తున్న సొసైటీలు కొత్తగా వచ్చిన మాక్స్‌ చట్టం పరిధిలోకి తీసుకురావడం జరిగింది. 1995 మాక్స్‌ చట్టం అమల్లోకి రావడంతో స్వయం ప్రతిపత్తికి జిల్లాలో పలు సొసైటీలు మాక్స్‌లోకి యాజమాన్యాలు తీసుకొచ్చాయి. సుమారు 3147 మాక్స్‌ చట్టం కింద నమోదు చేసుకున్నట్టు జిల్లా అధికారులు చెబుతున్నారు. ఐటీడీఏ, డీఆర్‌డీఏ, మెప్మాల పరిథిలో సొసైటీలు కొన్ని పని చేస్తున్నాయి. ఇవేకాకుండా, పాల ఉత్పత్తిదారులు, హౌస్‌ బిల్డింగ్‌ , కెడిట్‌ సొసైటీలు ఏర్పాటయ్యాయి. వాటిలో కొన్ని రిజిసే్ట్రషన్‌ సమయంలోనే జిల్లా సహకార శాఖ సాయం తీసుకుంటున్నారు. ఇవి కార్యకలాపాల వివరాలను ప్రతిఏటా సహకార శాఖకు నివేదించాలని జిల్లా సహకార అధికారి (డీసీవో) ప్రవీణ చెబుతున్నారు. ఐటీడీఏ, డీఆర్‌డీఏ, మెప్మా, మిల్క్‌ సంఘాలు మాత్రం ఎప్పటికప్పుడు నివేదిస్తున్నట్టు తెలిసింది. ప్రభుత్వ సంస్థల పరిథిలో పనిచేస్తున్నందున ఎటువంటి అక్ర మాలకు తావులేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా అధికారులు అభిప్రాయపడుతున్నారు. కాగా, హౌసింగ్‌ బిల్డింగ్‌ సొసైటీలు ప్రతి ఏడాది ప్లాట్‌ వివరాలు, అమ్మకాలు వంటి వాటిని తెలియజేయాలి. క్రెడిట్‌ సొసైటీల పరంగా డిపాజిట్లు, రుణాలు మంజూరు కూడా డీసీవో కార్యాలయానికి తెలియపర్చాలని వాదనను జిల్లా అధికారులు వినిపిస్తున్నారు. మాక్స్‌ చట్టం పేరిట తామెవ్వరికీ బాఽధ్యులు కాదని సొసైటీ పాలక వర్గాలు వ్యవహరించడం సరికాదంటున్నారు. ఇటువంటి సొసైటీలపై తరచూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నందున వాటిని గాడిలో పెట్టేందుకు డీసీవో దృష్టిని సారించారు. ప్రస్తుతం జిల్లాలో పనిచేస్తున్న, పనిచేయని సొసైటీల వివరాలతో జాబితాను రూపొందించడంతో తలముకలయ్యారు. ఇంతవరకు, సుమారు 209 సొసైటీలను వారు గుర్తించినట్టు తెలిసింది. వాటికి నోటీసులు ఇవ్వడానికి జిల్లా కలెక్టర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. మిగిలిన జాబితాను కూడా తయారుచేసి అటువంటివి ఉన్నట్టయితే వాటికి కూడా నోటీసులు జారీ చేయడానికి జిల్లా సహకార శాఖ సన్నద్దమవుతోంది. వాటివలన,మాక్స్‌ సొసైటీ ల్లో ఎటువంటి అక్రమాలకైనా చెక్‌ పెట్టేందుకు వీలుచిక్కుతుందని చెబుతున్నారు. ఈ ప్రయత్నాలు ఎంతవరకు ఫలించేనో? వేచి చూడాల్సివుంది.