Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 15 2016 @ 14:14PM

చెర్రీ సినిమాని ఇరకాటంలో పెట్టేసిన సుక్కూ, ఎన్టీఆర్

'తనీ ఒరువన్' రీమేక్ రామ్ చరణ్‌కి ఎంత అవసరమో తెలిసిందే. తమిళంలో విజయవంతమైన ఈ సినిమాతో విజయాన్ని అందుకోవాలన్నది చెర్రీ ఆలోచన. దర్శకుడు సురేందర్ రెడ్డి చెప్పిన కథని పక్కన పెట్టి మరీ తమిళంలో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ఈ కథని సూరి చేతికందించాడంటే పరిస్థితేంటో అర్థం చేస్కోవచ్చు. అలాంటిది ఇప్పుడీ సినిమా ఓ పెద్ద ఇరకాటంలో పడింది. దీనికి కారణం సుకుమార్-ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన 'నాన్నకు ప్రేమతో' సినిమానే. ఈ సినిమాలో ఎన్టీఆర్ వ్యూహాలను తెలుసుకోడానికి జగపతిబాబు ఓ 'చిప్' పెడతాడు. సేమ్ టు సేమ్ 'తనీ ఒరువన్'లోనూ ఇలాంటి సీనే ఉంటుంది. ఈ రెండు సినిమాకి ఇదే కీలకం. అయితే ఇప్పుడు సుక్కూ ఆల్రెడీ ఆ టెక్నిక్ వాడేశాడు గనక చెర్రీ సినిమా కోసం సూరి కొత్త టెక్నిక్‌ని కనిపెడతాడా లేక దీన్నే 'ఫాలో' అయిపోయాతాడా అన్నది చూడాలి.