Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 15 2016 @ 07:37AM

మాటల్లోనే స్వచ్ఛ చేతల్లో చెత్త హౖదరాబాద్‌

ఆంధ్రజ్యోతి, హైదరాబాద్‌ సిటీ : ప్రభుత్వం చెప్పే మాటలకు... ఆచరణలో అమలయ్యే వాస్తవా నికి ఆమడదూరం ఉంటోంది. విశ్వనగరం చేస్తామని పదే పదే ప్రకటనలు వినిపిస్తున్నా.. ఆస్థాయిలో ముందడుగు వేస్తున్నట్లు దరిదాపుల్లో కనిపించడం లేదు. నగరంలో అత్యంత కీలకమైన పారిశుధ్యమే ఇందుకు ఒక ఉదాహరణ. చెత్త నిర్వహణ సమర్థవం తంగా లేకపోవడం ఇందుకు నిదర్శనం. చెత్త సేకరణకు కొత్తగా ఆటో ట్రాలీలు, తడి, పొడి చెత్తకు వేర్వేరు డబ్బాల ప్రకటనలు ఆర్భాటమే తప్ప క్షేత్ర స్థాయిలో అలా లేదు. నగరంలో పర్యటిస్తున్న ఓ మంత్రి పదే పదే చెబుతున్న మాట ‘ఊపర్‌ షేర్వా నీ... అందర్‌ పరేషానీ’. నగరంలో పారిశుధ్య నిర్వ హణ మాటల్లో బాగానే ఉన్నా... ఆచరణలో మాత్రం అస్తవ్యస్తంగా ఉంది. ఇళ్ల నుంచి సేకరిస్తున్న చెత్తను వీధుల్లో డంప్‌ చేస్తున్నా తొలగించడానికి ఒకటి రెండు రోజులకు మించి సమయం పడుతోంది. నివాస ప్రాంతాలకు దూరంగా ఉండాల్సిన చెత్త కుండీలకు అటు వంటి స్థలాలు నగరంలో అందుబా టులో లేవు. చెత్త తరలించేందుకు వాడే భారీ వాహ నాలు వచ్చే వరకు కొన్ని వీధుల్లో చెత్త పేరుకుపోయి ఉంటోంది. దీంతో ఇక్కడ పేరుకుపోతున్న చెత్త కుప్పలతో చుట్టు పక్కల నివాసం ఉండే వారు ఇల్లు ఖాళీ చేసి వెళ్లాల్సిన పరిస్థితి. నలుమూలలా విస్తరి స్తున్న నగరంలో ఉత్పత్తి అవుతున్న చెత్త సేకరణకు అవసరమైన స్థలాలు అందుబాటులో లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. ఇప్పటికే శివారు ప్రాం తాల్లో ఉన్న చెత్త డంపింగ్‌ యార్డులకు వెళ్లి రావడానికి గంటల తరబడి సమయం పడుతోంది. నగరంలో ఏ మార్గంలో వెళ్లినా ట్రాఫిక్‌ సమస్యలు ఉండడంతో చెత్త సేకరణకు వినియోగిస్తున్న వాహ నాలు నిర్ణయిం చిన సమయాల్లో చెత్తను తరలించ లేకపోతున్నాయి. దీంతో వీధుల్లో ఏర్పాటు చేసిన కుం డీల వద్ద నుంచి చెత్త తొలగింపు ఆలస్యమవుతోంది.

నిర్వహణ లోపం... ప్రజలకు శాపం...

ఇంటింటికీ వెళ్లి రిక్షాల ద్వారా సేకరించిన చెత్తను సమీప ప్రాంతాల్లో చెత్తకుండీల్లో వేస్తున్నారు. ఇక్కడి నుంచి భారీ వాహనాల్లో నగర శివార్లకు తరలించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో ఎక్కడ ఆలస్యం జరిగినా చెత్త ఎక్కడికక్కడ పెద్ద మొత్తంలో పేరుకుపోతోంది. దీంతో ఆయా ప్రాంతాలు మురికి కూపాలుగా మారు తున్నాయి. ఎక్కడికక్కడ అపరిశుభ్ర వాతావరణం నెలకొని అంటు వ్యాధులు ప్రబలుతున్నాయి. ఇదంతా చెత్త నిర్వహణ సరిగా లేకనే జరుగుతోంది.

బాధ్యత మరుస్తున్న పౌరులు...

ఇళ్లల్లో, వ్యాపార సంస్థల్లో ఉత్పత్తి అయిన చెత్తను చెత్తకుండీల్లోనే వేయాల్సిన పౌరులు బాధ్యతారా హిత్యంతో వ్యహరిస్తున్నారు. దీంతో పలు చోట్ల చెత్త ను రోడ్లమీదే పారబోస్తున్నారు. రోడ్లు ఊడ్చే పారిశు ధ్య కార్మికులు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఊడ్చి వెళుతున్నా సాయంత్రం కల్లా మళ్లీ చెత్తను ఎక్కడపడితే అక్కడ పారబోస్తున్నారు. చెత్త కుండీలు లేక ఖాళీ స్థలం కనిపిస్తే చాలు చెత్తను వేస్తున్నారు.

చెత్త సేకరణకు 2 వేల ఆటో ట్రాలీలు...

నగరంలో చెత్త సేకరణకు ఇటీవల కాలంలో ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిచ్చింది. స్వచ్ఛ హైదరా బాద్‌ కార్యక్రమంలో భాగంగా సీఏం కేసీఆర్‌ నగరం లో చెత్త సేకరణకు 2 వేల ఆటో ట్రాలీలు, 44 లక్షల కు కుటుంబాలకు తడి, పొడి చెత్తలను వేర్వేరుగా సేకరించేందుకు రెండు చెత్త బుట్టలను ఇస్తానని ప్రకటించారు. అందులో భాగంగానే ఆటో ట్రాలీలు, ఇంటింటికీ 2 చెత్త డబ్బాలను పంపిణీ చేస్తున్నారు. ఇది నగరంలో కొన్ని చోట్ల మాత్రమే జరిగింది. పూర్తి స్థాయిలో పంపిణీ అయి వాటి నిర్వహణ సమర్థవం తంగా ఉంటేనే నగరంలో చెత్త సమస్యకు చెక్‌ పడు తుందని నగర వాసులు అభిప్రాయపడుతున్నారు.