desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 15 2016 @ 01:49AM

రాజ్యాంగ ధర్మాసనానికి అరుణాచల్‌ వివాదం

న్యూఢిల్లీ, జనవరి 14: అరుణాచల్‌ప్రదేశ్‌ రాజకీయ సంక్షోభం విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి చేరింది. గవర్నర్‌, స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్లకు రాజ్యాంగంలో కల్పించిన విధులు, అధికారాలపై బెంచ్‌ నిర్ధారించాల్సి ఉంటుందని సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ జేఎస్‌ ఖేహార్‌, జస్టిస్‌ సీ నాగప్పన్‌ తెలిపారు. అరుణాచల్‌ రాజకీయ సంక్షోభంపై గువాహటి హైకోర్టు ఉత్తర్వులకు సంబంధించి వీలైనంత త్వరగా రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తానని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టీఎస్‌ ఠాకూర్‌ హామీ ఇచ్చారు.