Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 14 2016 @ 20:06PM

90 వేల పోలీసులు.. 250 బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు.. ఇదీ పరిస్థితి

న్యూఢిల్లీ, జనవరి 14: దేశ రాజధాని ఢిల్లీలో పఠాన్‌కోట్ లాంటి ఘటన జరిగితే పరిస్థితి ఏమిటి..? ఢిల్లీ పోలీసులు ధీటుగా ఎదుర్కోగలరా..? ఆ పరిస్థితి లేదంటున్నారు ఢిల్లీ పోలీస్ చీఫ్ బిఎస్ బస్సీ. దీని నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేమంటున్నారు.
 
ఎందుకంటారా.. ఢిల్లీలో సుమారు 90 వేల మంది పోలీసులుండగా, కేవలం 250 బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు మాత్రమే ఉన్నాయట. కీలక భద్రతా ప్రాంతాల్లో గస్తీ కాసే వారు మాత్రమే వీటిని వినియోగిస్తారు. అవి కూడా ఒక్కొక్కటి 11 కేజీల బరువు. గంటల తరబడి వీటిని వేసుకోవడం కూడా కష్టమే. అందుకే లైట్ జాకెట్ల కోసం ప్రయత్నిస్తున్నట్లు ఢిల్లీ పోలీస్ చీఫ్ చెబుతున్నారు. 5 కేజీల బరువైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కమెండోలకు, 3 నుంచి ఒకటిన్నర బరువైనవి పోలీసుల కోసం ఆర్డర్ చేస్తున్నట్లు బస్సీ వివరించారు. 
 
దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోనే పరిస్థితి ఇలా ఉంటే.. ఇక రాష్ట్రాల్లో ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.