Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 14 2016 @ 19:20PM

జాతీయ బాల్‌బ్యాడ్మింటన్‌ మహిళల విజేత కర్ణాటక

ఖమ్మం: జిల్లా కేంద్రం ఖమ్మంలో జరుగుతున్న జాతీయ బాల్‌బ్యాడ్మింటన్‌ పోటీల మహిళల విభాగంలో కర్ణాటక జట్టు విజేతగా నిలిచింది. పట్టణంలోని పెవిలియన్‌గ్రౌండ్స్‌లో జరుగుతున్న ఈ క్రీడా పోటీలలో చెన్నై జట్టు రన్నరప్‌గా నిలిచింది. బాల్‌బ్యాడ్మింటన్‌ క్రీడను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో హాజరైన క్రీడా ప్రియులతో మైదానం కిటకిటలాడింది.