Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 14 2016 @ 13:37PM

‘నిర్భయ’ కంటే ఘోరమైన ఘటన ఇది !

ముజాఫర్‌నగర్: పోకిరీ సినిమాలో పోలీస్ అధికారి కూతురిని రేప్ చేసి ఆ వీడియోను నెట్‌లో పెట్టే సీన్ చూస్తే, ఎవరికైనా ఆ వీడియోను పెట్టినవాళ్లను చంపాలన్నంత కోపం వస్తుంది. అలాంటి ఓ దుర్మార్గపు పనే చేశారు ఉత్తరప్రదేశ్‌‌కు చెందిన కొంతమంది యువకులు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌కు చెందిన ఓ ఫీల్డ్ ఆఫీసర్‌పై కొంతమంది దుండగులు గ్యాంగ్‌రేప్ చేశారు. చేసిన నీచమైన పని చాలదన్నట్టు, ఆ అరాచకాన్ని వాట్సప్‌లో పోస్ట్ చేశారు. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఈ ఘటనతో  తీవ్ర మనోవేదనకు గురైన 40 సంవత్సరాల వయసున్న ఆ మహిళా ఫీల్డ్ ఆఫీసర్ విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై స్థానిక పోలీస్ అధికారి మాట్లాడుతూ బాధితురాలిని గ్యాంగ్‌రేప్ చేసిన వారిలో ఒకరు ఆమెను కొన్ని నెలల నుంచి హింసిస్తున్నట్లు తెలిపారు. అయితే బాధితురాలి కుటుంబానికి సామాజిక సంఘాలు మద్ధతు తెలిపాయి. ప్రభుత్వం ఆర్థికంగా ఆమె కుటుంబాన్ని ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.