Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 14 2016 @ 09:46AM

బ్యాటరీతో కారు పరుగులు

  • కిట్స్‌ విద్యార్థుల ఘనత 
భీమారం : ఎర్రగట్టుగుట్ట సమీపంలోని కిట్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాల మెకానికల్‌ ఇంజనీరింగ్‌ తృతీయ సంవత్సర విద్యార్థులు బ్యాటరీతో నడిచే కారును రూపొందించారు. బుధవారం కళాశాలలో ఈ కారును ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కిట్స్‌ డైరెక్టర్‌ వై.మనోహర్‌ హాజరయ్యారు. ఈ కారును ఎఫికాల్‌ - 2016 అనే సాంకేతిక ఈవెంట్‌లో ప్రదర్శిస్తారని వెల్లడించారు. ఈ నెల 21న పంజాబ్‌ రాష్ట్రంలో ఎఫికాల్‌ ఈవెంట్‌ జరుగనున్నట్లు తెలిపారు. ఈ కారును మెకానికల్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ సీహెచ.కర్ణాకర్‌ సహకారంతో మెకానికల్‌ ఇంజనీరింగ్‌ విభాగాధిపతి ప్రొఫెసర్‌ కె.ఈశ్వరయ్య సౌజన్యంతో తయారు చేశారన్నారు. కాలుష్యరహిత కారు బ్యాటరీతో 6గంటలపాటు చార్జింగ్‌ చేస్తే రెండు గంటలపాటు నిర్విరామం గా ప్రయాణం చేస్తుందన్నారు. 20 కి.మీ. నుంచి 30 కి.మీ. వరకు ఈ కారు లో ప్రయాణించవచ్చన్నారు. ఈ కారు రూపకల్పనకు బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఆదిలాబాద్‌ రూరల్‌ సీఐ పి.శ్రీనివాస్‌ సహకారంతో రూపొందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ కె.గురురాజు, మెకానికల్‌ ఇంజనీరింగ్‌ విభాగాధిపతి కె.ఈశ్వరయ్య, కెప్టెన కె.విక్రం పటేల్‌, పి.సాయిరాంకౌశిక్‌, బి.సునిల్‌కుమార్‌, పి.శ్రీనికేత, ఎ.ఉమామహేశ్వర్‌రావు, ఎం.అరుణ్‌ ప్రకాశ, కె.ప్రదీ్‌పకుమార్‌, పీఆర్‌వో కృష్ణమాచార్యులు పాల్గొన్నారు.