Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 14 2016 @ 02:39AM

ఢిల్లీలో ఘనంగా ఏర్పాట్లు: కంభంపాటి

న్యూఢిల్లీ, జనవరి 13(ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండగను ఢిల్లీలో ఘనంగా నిర్వహించడానికి ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. సంక్రాంతి పండగను ఘనంగా జరుపుకొని భావితరాలను సంప్రదాయాలను చాటుదాం అని ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌ రావు వ్యాఖ్యానించారు. రాష్ట్ర చరిత్రలో మొదటి సారిగా ప్రభుత్వం తరఫున పండగ జరుపుతున్నామని చెప్పారు. ఢిల్లీలోని ఉమ్మడి భవన్‌లో సంక్రాంతి పండగను నిర్వహిస్తున్నామని, తెలుగు ప్రజలంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు.