Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 13 2016 @ 22:33PM

అటవీయాత్రలో అవీ ఇవీ

ఇద్దరు శాస్త్రవేత్తలు ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ఒక అటవీయాత్ర చేసి అందులోని ప్రయోజనాలేమిటో వివరించారు. అదే సమయంలో అవసరమైన జాగ్రత్తలన్నీ తీసుకోకపోతే, అటు యాత్రికులకు, ఇటు అడవి జంతువులకు యాత్రలో ఎదురయ్యే ప్రమాదాల గురించీ వివరించారు. టెక్సాస్‌ ఏ అండ్‌ ఎమ్‌ యూనివ ర్సిటీకి చెందిన డాక్టర్‌ లీ ఫిట్జ్‌గెరాల్డ్‌, డాక్టర్‌ అమందా స్ట్రోంజా.. వీరిద్దరూ అడవుల్లో వారి ప్రయాణం గురించిన విశేషాలు, ఈ సమయంలో ఎదురైన సమస్యల గురించి విపులీకరించారు. ఇందులో నేచర్‌ టూరిజం, ఎకోటూరిజం ఈ రెండూ అడవి జంతువులు, అరణ్యవాసుల పాలిట కొంత మేరకు సమస్యాత్మకంగా కూడా మారుతున్నాయన్నారు. నిరంతరంగా సాగే ఈ అటవీ యాత్రలో అటవీ వాసుల, అడవి జంతువుల జీవితాలు ఒక్కోసారి దుర్భరంగా కూడా మారుస్తున్నాయంటూ వారు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. కాకపోతే మీడియా ఈ సమస్యను అతిగా చిత్రిస్తున్నాయని వ్యాసంలో వారు పేర్కొన్నారు. అయితే ఎకోటూరిజం వల్ల అడవి జంతువులకు ఎంతో కొంత నష్టం జరుగుతున్న మాట మాత్రం నిజం. అయినా కొన్ని రకాల రక్షణ చర్యలు చేపట్టడం ద్వారా ఆ నష్టం కలగకుండా చేయడం అసాధ్యమేమీ కాదని వివరించారు. కాకపోతే నిరంతరం అటవీ యాత్రికులను గమనిస్తున్న అడవి జంతువులు, మనుషులంటే ఉండే సహజమైన భయానికి దూరమవుతున్నాయి . దీనివల్ల మనుషులు కలవగానే ఆహారం తినడం మానేసే పరిస్థితి ఇప్పుడు లేదని చెబుతున్నారు. ఈ వివరాలన్నీ ‘జర్నల్‌ ట్రెండ్స్‌ ఇన్‌ ఇకోలజీ అండ్‌ ఎవొలూషన్‌’ అనే పత్రికలో ఇటీవల ప్రచురితమయ్యాయి. ఏమైనా, ఈ ఇరువురి పరిశోధనా వ్యాసం ద్వారా మనుషుల అటవీయాత్రల కారణంగా ఎదురయ్యే బాధల్ని అడవిలో మౌనంగా భరిస్తున్న అటవీ జంతువులకు ఎంతో కొంత విముక్తి కలగడం మాత్రం ఖాయం.