Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 13 2016 @ 21:11PM

అందుకోసమే వీటిని తయారు చేశారట!

టోక్యో: ఎంత వయసు వచ్చినా.. చిన్న పిల్లలను చూస్తే కామ వాంఛలను అదుపులో పెట్టుకోలేని వారిని పీడోఫైల్స్‌ అంటారు. దురదృష్టవశాత్తూ ఇలా ఎందుకు జరుగుతుందో అని విచారించి వారికి ట్రీట్‌మెంట్‌ ఇచ్చే వైద్యులు కానీ, కౌన్సిలింగ్‌ సెంటర్లు కానీ ఇప్పుడు ఎక్కడా లేవు. ఎందుకంటే చిన్న పిల్లల పట్ల ఆకర్షణ అనేది ఒక వ్యాధి అనే విషయం ఎవరికీ తెలియదు.
 
అందుకే చిన్న పిల్లలపై ఇలాంటి అఘాయిత్యాలను అరికట్టడంతోపాటు ఇలాంటి పీడోఫైల్స్‌ను సంతృప్తి పరచడానికి జపాన్‌కు చెందిన ఓ వ్యక్తి ముందుకొచ్చారు. ఆయన పేరు షిన్‌ తకాగి. ఈయన టోక్యోలో ఓ పరిశ్రమ ఏర్పాటు చేసి చైల్డ్‌ సెక్స్‌ డాల్స్‌ను తయారు చేస్తున్నారు. వీటిని ప్రపంచవ్యాప్తంగా సప్లయ్‌ చేసి పీడోఫైల్స్‌ను అరికట్టాలనేది ఆయన ప్లాన్‌.
 
‘చూడగానే ఆహ్లాదకరంగా కనిపించే చిన్నపిల్లలను శృంగార వస్తువులుగా భావించడమనేది కచ్చితంగా ఒక రోగమే. నాకు ఇటీవలే తైవాన్‌ నుంచి ఒక వ్యక్తి లెటర్‌ రాశాడు. తానొక పీడోఫైల్‌ అని, ఇలాంటి బొమ్మలను తయారు చేసి తనను ఎలాంటి నేరమూ చేయకుండా కాపాడానని నన్ను అభినందించాడ’ని షిన్‌ తకాగి తెలిపారు.
 
కాగా, ఇలాంటి సెక్స్‌ డాల్స్‌ వల్ల మరింత మంది పీడోఫైల్స్‌ పుట్టుకొచ్చే ప్రమాదముందని యూనివర్సిటీ ఆఫ్‌ టొరంటో పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటివాటిని అనుమతించడమంటే చైల్ట్‌ సెక్స్‌ను లీగలైజ్‌ చేయడమేనని, అప్పుడు సమాజంలో మరింత విపరీత ధోరణులు పెరిగిపోయే ప్రమాదముందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.