Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 13 2016 @ 15:59PM

సంక్రాంతి కానుకగా 'సర్దార్' గిఫ్ట్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్‌డే సందర్భంగా ‘సర్దార్’ టీజర్‌‌ విడుదల చేసిన చిత్రయూనిట్ సంక్రాంతి పండుగకు కూడా మరో గిఫ్ట్‌తో రెడీ అవుతున్నాడు.. ఫస్ట్ టీజర్‌కే అంచనాలు పెంచేసిన పవన్.. అడపాదడపా ఈ మూవీ ఆన్ లొకేషన్ స్టిల్స్ విడుదల చేస్తూ.. అభిమానులను ఆనందపరుస్తున్నాడు. అలాగే సంక్రాంతి కానుకగా జనవరి 14న సర్దార్ గబ్బర్ సింగ్ మరో టీజర్ రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర నిర్మాత శరత్ మారర్ సోషల్ మీడియా ద్వారా తెలుపుతూ.. దీనికి సంబంధించిన  పోస్టర్లను రిలీజ్ చేశాడు. కె.ఎస్.రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. పవన్ సరసన కాజల్ నటిస్తున్న ఈ సినిమాకి రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ సమకూరుస్తున్నాడు.