Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 13 2016 @ 14:51PM

యూటర్న్‌లో మోదీ, కేసీఆర్ ఎక్స్ పర్ట్‌లు : దిగ్విజయ్

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో కేసీఆర్‌, బాబు మాటలు ప్రజలు మర్చిపోలేదని...ఇప్పుడు చంద్రబాబు, కేసీఆర్‌ ఒకరినొకరు పొగుడుకుంటున్నారని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ఇస్తే టీఆర్‌ఎస్‌ను విలీనం చేస్తామని కేసీఆర్ చెప్పి మాటమార్చారని మండిపడ్డారు. టీఆర్ఎస్ అధికారం, ఆర్థిక అండదండలతో ప్రలోభ పెడుతోందని ఆరోపించారు. మోదీ, కేసిఆర్ యూటర్న్‌ తీసుకోవడంలో ఎక్స్ పర్ట్‌లని దిగ్విజయ్ దుయ్యబట్టారు. 15, 16నాటికి అభ్యర్థుల ఎంపిక పూర్తి అవుతుందని 18న మేనిఫెస్టో విడుదల‌ చేయనున్నట్లు ఆయన తెలిపారు. సెటిలర్లను నానా మాటలు అన్న కేసిఆర్, కేటిఆర్ ఓట్ల కోసం ఇప్పుడు ప్రేమ కురిపిస్తున్నారని దిగ్విజయ్‌ మండిపడ్డారు.