Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 13 2016 @ 13:49PM

హన్సికకు ఎంత పెద్దమనసో..!!

అందమే కాదు అందమైన మనసు కూడా తన సొంతమని మరోసారి నిరూపించుకుంది హన్సిక. అనాథ పిల్లల దత్తత, పేద పిల్లలకు విద్యాసాయం వంటి కార్యక్రమాలతో సామాజిక సేవలో ఈ తరం హీరోయిన్లందరి కంటే ముందు వరుసలో ఉండే ఈ ముంబై బ్యూటీ తాజాగా మరోమారు పెద్దమనసు చాటుకుంది. ఇప్పటికే చెన్నై వరద బాధితుల కోసం విరాళం ప్రకటించిన హన్సిక, వరద సహాయక పనుల్లో పాల్గొన్న 100 మందికిపైగా పారిశుద్ధ్య కార్మికులకు తాజాగా సహాయాలను అందజేసింది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న ‘పోకిరి రాజా’ సెట్స్‌లోనే ఒక్కో కార్మికుడికి 10 కేజీల బియ్యం, ఇతర వస్తువులను పంపిణీ చేసింది. ఆ సమయంలో ఫొటో తీయబోతుంటే... సహాయాన్ని పబ్లిసిటీ చేసుకోవడం తనకు ఇష్టం ఉండదని ఫొటోగ్రాఫర్‌ని సున్నితంగా అడ్డుకుందట. ఈ విషయాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన యూనిట్‌ సభ్యులు హన్సికని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.