Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 13 2016 @ 11:06AM

బట్టలూడదీసి కొట్టిస్తా: ఆర్‌.కృష్ణయ్య

ఎన్నికల్లో గెలిచేందుకు టీఆర్‌ఎస్‌ నాయకులు బెదిరిస్తున్నారని, దొంగ కేసులు బనాయిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య ఆరోపించారు. ‘‘అలా చేస్తే నాకు ఒక్క ఫోన్ కాల్‌ చేయండి. వెయ్యిమందిని పంపిస్తా. టీఆర్‌ఎస్‌ నాయకులను, పోలీసులను బట్టలూడదీసి కొట్టిస్తా’’ అని హెచ్చరించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలిస్తే.. ఇక్కడి ఆదాయం, నిధులను ఇతర పథకాలు, ప్రాంతాలకు తరలిస్తారని ఆరోపించారు. ‘‘కేసీఆర్‌ను గెలిపిస్తే డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు రావు. ఉద్యోగాలు రావు. ప్రజలను కలవడు. ఫాంహౌ్‌స్ లో పడుకుంటాడు. ఓడిస్తేనే భయంతో పని చేస్తాడు. మదం కాళ్ల కిందకు దిగి వస్తుంది’’ అని పిలుపునిచ్చారు.