Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 13 2016 @ 06:16AM

భూమిచ్చిన రైతులకు మార్చిలో ప్లాట్లు: జేసీ

  • రైతుల సందేహాలను నివృత్తి చేసిన అధికారులు
తుళ్లూరు/తాడికొండ:‘నవ్యనగరి నిర్మాణానికి భూములిచ్చిన మాకు నివాస, వాణిజ్య ప్లాట్లు ఎక్కడిస్తారు? రోడ్లు ఎటు వేస్తారు?. మా గ్రామానికి దగ్గరలో ఏఏ సంస్ధలు ఏర్పాటు చేస్తారు..’ అంటూ రాజధాని గ్రామాల రైతులు సీఆర్‌డీఏ అధికారులను ఆరా తీశారు. అమరావతి నగర నిర్మాణ డ్రాఫ్ట్‌ మాస్టర్‌ప్లానపై మంగళవారం రాజధాని గ్రామాల్లో అవగాహన సదస్సులు ప్రారంభమయ్యాయి. తొలిరోజు నేలపాడు, శాఖమూరు, అనంతవరం, బోరుపాలెం, అబ్బరాజుపాలెం గ్రామాల్లో సీఆర్‌డీఏ అధికారులు సదస్సులను నిర్వహించారు. నేలపాడులో జేసీ డాక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ సదస్సు ప్రారంభించారు. మాస్టర్‌ప్లాన ప్రకారం రైతులకు కేటాయించే ప్లాట్ల స్వరూప, స్వభావాలపై సీఆర్‌డీఏ అధికారులు పోస్టర్‌ ప్రజెంటేషన ఇచ్చారు. 
పెద్ద సంఖ్యలో రైతులు హాజరు
సదస్సుకు పెద్దసంఖ్యలో రైతులు హాజరై ఆసక్తిగా తిలకించారు. రాజధానిలో ఏ గ్రామ పరిధిలో ఏ నగరాలు వస్తాయో సీఆర్‌డీఏ అదనపు డైరెక్టర్‌ ప్రసన్న వెంకటేశ వివరించారు. ఆర్‌3లో రైతులకు నివాస ప్లాట్లు, సీ2లో వాణిజ్య ప్లాట్లు కేటాయిస్తారని సీఆర్‌డీఏ ల్యాండ్‌ డైరెక్టర్‌ చెన్నకేశవరావు చెప్పారు. రైతు నివాస ప్లాట్లలో జీ-3 భవనాలకు అనుమతి ఉంటుందన్నారు. ఎక్స్‌ప్రెస్‌ వేలు, హైవేలు, అవుటర్‌ రింగ్‌రోడ్డు, అంతర రవాణా మార్గాలు ఎటు వస్తాయో సీఆర్‌డీఏ ప్లానింగ్‌ డైరెక్టర్‌ రాముడు తెలిపారు. సెంట్రల్‌ జోనలో జీ11 భవనాలు, రైతులకిచ్చే ప్లాట్లలో జీ3 భవనాలు నిర్మాణానికి అనుమతులు ఉంటాయని చెప్పారు. భవన నిర్మాణ అనుమతుల విషయంలో రైతులు సందేహాలకు అధికారులు వివరణలు ఇచ్చారు.
మంత్రుల హమీలు నెరవేర్చాలి..
నేలపాడు, శాఖమూరు, అనంతవరం గ్రామాల రైతులు తమకు మంత్రులిచ్చిన హామీ ప్రకారం 50గజాల వాణిజ్య స్థలాన్ని అదనంగా ఇవ్వాలని కోరారు. నిరుపేదలకిచ్చే పింఛన రూ.2,500 అర్హులైన అందరికీ ఇవ్వాలని, గ్రామ కంఠాలను తేల్చాలని, ఉచిత విద్య, వైద్యం అమలు చేయాలని కోరారు. 2014 డిసెంబరు 8వరకు రాజధాని గ్రామాల్లో ఉన్న అందరినీ స్థానికులుగా గుర్తించాలన్నారు. రాజధాని గ్రామాల్లో రైతు కమిటీలు ఏర్పాటు చేయాలని, రైతులకు సమాచారం అందించేందుకు కాంపిటెంట్‌ అథారిటీ కార్యాలయాల్లో నిపుణులతో సలహా కేంద్రాలను ఏర్పాటు చేయాలని రైతు ప్రతినిధులు కోరారు.
రైతుల సందేహాలపై జేసీ వివరణ
మాస్టర్‌ప్లానపై రైతులు వ్యక్తం చేసిన సందేహాలకు అధికారులు వివరణ ఇచ్చారు. శాఖమూరు వంటి గ్రామాలను తాకుతూ వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ రోడ్లపై పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు కింద పోయినా అంతే విస్తీర్ణం మరో చోట కేటాయిస్తారని, కట్టడాలకు రెట్టింపు విలువ ఇస్తారని జేసీ చెప్పారు. రాజధానికి భూములిచ్చిన రైతులకు మార్చి15లోపు లాటరీ ద్వారా గ్రామాల వారీగా ప్లాట్ల కేటాయిస్తామని చెప్పారు. హద్దులు చూపి, కాగితపూర్వకంగా ప్లాట్లు ఇస్తామన్నారు. ఏప్రిల్‌లో రోడ్ల నిర్మాణ ప్రక్రియ ప్రారంభమౌతుందని, గ్రామ కంఠాల వివరాలను కాంపిటెంట్‌ అథారిటీల వద్ద ఉంచుతామని, వాటిపై అభ్యంతరాలు ంటే మరోసారి పరిశీలిస్తామన్నారు. పింఛన దరఖాస్తుదారుల్లో 2,600 మందికి వేరేచోట భూమి ఉన్నట్లు ఆనలైనలో ఉన్నందున, తహసీల్దార్‌లతో విచారించి, భూమిలేని వారిని గుర్తిస్తామని జేసీ చెప్పారు. మాస్టర్‌ప్లానపై అభ్యంతరాలను నెలాఖరులోగా తెలియజేయాలని ఆయన సూచించారు. రైతులు ప్రస్తావించిన అంశాలపై చర్చిస్తామని జేసీ డాక్టర్‌ శ్రీధర్‌ రైతులకు భరోసా ఇచ్చారు.
నేడు రెండు మండలాల్లో..
రాజధాని తుదిమ్యాప్‌పై బుధవారం నీరుకొండ కురగల్లు, ఐనవోలు, రా య పూడి, కొండమరాజుపాలెం, లి ంగాయపాలెం, తాళ్ళాయపాలెం, ఉ దండ్రాయునిపాలెంలో సదస్సులు నిర్వహించనున్నారు. సెలవులు తరువాత 18 వ తేదీ నుంచి మిగిలిన గ్రామాల్లో సదస్సులు జరుగుతాయని అధికారిక వర్గాలు తెలిపాయి.సంపూర్ణ పారిశుధ్య నినాదాన్నిరాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయాలిగుంటూరు (వి ద్య): సంపూర్ణ పారిశుధ్య నినాదాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయాలని స్పీకర్‌ డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు అన్నారు. జడ్పీ సమావేశ మందిరంలో మంగళవారం కడపజిల్లా పంచాయతీరాజ్‌ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. మరుగుదొడ్ల నిర్మాణంలో సత్తెనపల్లి నియోజకవర్గం రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉందని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గాల్లో విస్తృతంగా మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టి సంపూర్ణ పారిశుఽధ్య నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలని కోరారు. ప్రధానంగా పాఠశాల స్థాయిలో విద్యార్థులకు ఆయా విషయాలపై అవగాహన కల్పించాలన్నారు. స్వచ్చ ఆంధ్రప్రదేశ్‌ కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు. స్మశానాలను సుందరంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందన్నారు.