Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 13 2016 @ 02:33AM

రోజాపై సస్పెన్షన్ ఎత్తేయండి

  • అది నిబంధనలకు విరుద్ధం
  • కోర్టుకి వెళితే అసెంబ్లీ ఆధిపత్యం దెబ్బతింటుంది
  • స్పీకర్‌కు వైసీపీ అధినేత జగన్‌ లేఖ
హైదరాబాద్‌, జనవరి 12(ఆంధ్రజ్యోతి): ‘శాసనసభ నియమ నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాపై విధించిన సస్పెన్షనను ఎత్తివేయాలి. పారదర్శకంగా, హేతుబద్ధంగా, తెలివిగా వ్యవహరించకుంటే.. స్పీకర్‌గా మీ నిర్ణయాన్ని న్యాయస్థానం ద్వారా ప్రశ్నిస్తాం. అదే జరిగితే శాసనసభ ఆధిపత్యం దెబ్బతింటుంది. అది మనందరికీ విషాదకరమైన రోజు అవుతుంది’ అని స్పీకర్‌ కోడెల శివప్రసాదరావుకు రాసిన లేఖలో వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన రెడ్డి పేర్కొన్నారు. ఈమేరకు మంగళవారం మరోసారి స్పీకర్‌కు జగన్‌ లేఖ రాశారు. 340(2) నిబంధనకు విరుద్ధంగా రోజాను అసెంబ్లీ నుంచి ఏడాది పాటు సస్పెండ్‌ చేశారని, దానిని ఎత్తివేయాలని విజ్ఞప్తి చేస్తూ గత ఏడాది డిసెంబరు 19న లేఖ రాశానని జగన గుర్తు చేశారు. ‘మీ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోండి. 340(2) నిబంధన కింద రోజాను ఏడాదిపాటు సస్పెండ్‌ చేయ డం చెల్లదు. ఇది శాసనసభ వ్యవహారాలకు వ్యతిరేకం. ఇది అన్యాయం, రాజ్యాంగ విరుద్ధం’ అని పేర్కొన్నారు. ‘340(2) నిబంధన ప్రకారం సభ్యుడిని ఒక సెషనలో మిగిలిన కాలానికే సస్పెండ్‌చేసే అధికారం ఉంది. సస్పెండ్‌ చేయాలంటే సభలో ఓటింగ్‌ నిర్వహించాలి.’ అని చెప్పారు. ఈ నిబంధన కింద మూజువాణి ఓటుతో సభ్యునిపై సస్పెన్షన వేటు వేయడం చట్టవిరుద్ధం అవుతుందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఈ తీర్మానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పుడు స్పీకర్‌ తిరస్కరించి ఉండాల్సిందన్నారు. ఈ తీర్మానంపై మంత్రి యనమల వ్యాఖ్యలు దురదృష్టకరమని అన్నారు.