Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 16 2014 @ 00:20AM

వేర్వేరు మండలాల్లో జ్వరాలతో ఐదుగురి మృతి


వేర్వేరు మండలాల్లో జ్వరాలతో సోమవారం ఐదుగురు మృతి చెందారు. ఆసిఫాబాద్‌ మండలం కౌడన్‌మోవాడకు చెందిన ఆత్రం గంగు, సిర్పూర్‌(యు) మండలంలోని సీతాగోందికి చెందిన వెడ్మ అశోక్‌, జైనూర్‌ మండలంలోని, పార గ్రామానికి చెందిన కుమ్ర దీపిక, పొచంలొద్దికి చెందిన మానిక్‌రావు, వేమనపల్లి మండలంలోని జాజులపేట్‌కు చెందిన వసంత్‌ మృతి చెందారు.
ఆసిఫాబాద్‌ రూరల్‌: ఆసిఫాబాద్‌ మం డలం కౌడన్‌మోవాడకు చెందిన ఆత్రం గం గు(30) జ్వరంతో బాధపడుతూ చికిత్స పొం దుతూ సోమవారం మృతి చెందాడు. కు టుంబ సభ్యుల కథనం ప్రకారం.. గంగు మూ టడు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నారు. ఆసిఫాబాద్‌ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఫ సిర్పూర్‌(యు)లో...
సిర్పూర్‌(యు) : మండలంలోని సీతాగోందికి చెందిన వెడ్మ అశోక్‌(8) జ్వరంలో మృతి చెందాడు వారం రోజుల నుంచి జ్వరంతో బాధపడుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడని కుటుంబీకులు తెలిపారు.
ఫ జైనూర్‌లో...
జైనూర్‌ : మండలంలోనపి ఉషేగాం పరిధిలో గల పార గ్రామానికి చెందిన కుమ్ర దీపిక(6), పొచంలొద్ది గ్రామానికి చెందిన మెస్రం మానిక్‌రావు (50)లు సోమవారం జ్వరంతో మృతి చెందారు.
ఫ వేమనపల్లిలో...
వేమనపల్లి : మండలంలోని జాజుల పేట గ్రామంలో విష జ్వరం సోకి ఆదివారం రా త్రి కొండ్రు వసంత్‌ (18) అనే యువకుడు మృతిచెందాడు.