Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 13 2016 @ 01:02AM

పర్యాటకంపై దృష్టి పెట్టండి

విశాఖపట్నం (ఆంధ్రజ్యోతి): విదేశీ పర్యాటకులను ఆకర్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పన్నులను తగ్గించిందని కేంద్ర విమానయాన శాఖా మంత్రి పూసపాటి అశోక్‌ గజపతిరాజు అన్నారు. విశాఖలో జరుగుతున్న భారత పరిశ్రమల సమాఖ్య (సిఐఐ) భాగస్వామ్య సదస్సులో మంగళవారం పర్యాటక రంగంపై జరిగిన ప్రత్యేక సదస్సులో మాట్లాడారు. రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధి సాధించడానికి అపారమైన అవకాశాలు ఉన్నాయన్నారు. వీటిని పారిశ్రామిక వేత్తలు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. పర్యాటకరంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పన్ను రాయితీలను ప్రకటించిందని తెలిపారు. పర్యాటకుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పథకాలను రూపొందిస్తే ఈ రంగాన్ని మరింత అభివృద్ధి చేయడానికి అవకాశముంటుందన్నారు. దక్షిణాదిలో తొలి మున్సిపాలిటీగా అవతరించిన భీమునిపట్నం వంటి పురాతన చారిత్రాత్మకమైన ప్రాంతాలు, అడవులు, పుణ్యరక్షేతాలు రాష్ట్రంలో ఉన్నాయన్నారు. పర్యాటక రంగ అభివృద్ధిలో భాగంగానే రాష్ట్రంలో పనిచేస్తున్న విమానాశ్రయాలకు అదనంగా మరో మూడు ఆధునిక విమానాశ్రయాలను నెలకొల్పడానికి అనుమతులు మంజూరు చేశామని చెప్పారు. పర్యాటక రంగం వల్ల పెట్టుబడులు పెరగడంతోపాటు ఉపాఽధి అవకాశాలు లభిస్తా యని అశోక్‌ పేర్కొన్నారు.