Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 12 2016 @ 04:54AM

ఆ పని చేసి ఉద్యోగం పోగొట్టుకున్నాడు!

కాలీఫోర్నియా: బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అసభ్యంగా ప్రవర్తించిన ఓ ఉన్నతాధికారి తన ఉద్యోగం కోల్పోయాడు. కీలకమైన రక్షణ శాఖలో పనిచేస్తూ అప్రమత్తంగా ఉండాల్సింది పోయి.. పోర్న్‌ చిత్రాలు చూస్తూ పై అధికారుల కంట్లో పడ్డాడు. ఫలితంగా ఉద్యోగం పోగొట్టుకున్నాడు.
 
కాలీఫోర్నియా రాష్ట్రంలోని శాండియాగోలో గల నేవల్‌ కమాండ్‌ బేస్‌లో పసిఫిక్‌ ఫ్లీట్‌ క్యారియర్‌ వార్‌ ఫేర్‌ ఆఫీసర్‌ రిక్‌ విలియమ్స్‌.. తన ఉద్యోగ సమయంలో ప్రభుత్వ కంప్యూటర్‌లో పోర్న్‌ చిత్రాలు చూస్తూ దొరికిపోయాడు. రహస్య సమాచారం నిక్షిప్తమై ఉండే నేవీ కంప్యూటర్‌ నుంచి అరక్షితమైన వెబ్‌సైట్లలోకి ఎంటర్‌ అవడం నేరం. దీంతో పై అధికారులు అతణ్ని తక్షణమే విధుల్లోంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ‘ఇది కేవలం పొరపాటు మాత్రం కాదు. కావాలని ఊద్దేశపూర్వకంగా చేసిన నేరమే. అందుకే అతణ్ని ఉద్యోగంలో నుంచి తొలగించామ’ని నేవీ ఓ ప్రకటన విడుదల చేసింది.