desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 12 2016 @ 04:52AM

ఆ పాప స్కూలుకెళ్లేందుకే.. ప్రత్యేకంగా ఓ రైలు, స్టేషన్ ఏర్పాటు చేశారు!

టోక్యో: అధికారం చేతిలోకి రాగానే తమకు ఓట్లేసిన ప్రజలను పురుగుల కంటే హీనంగా చూసే ప్రభుత్వాలున్న రోజులివి. ఎన్నో వినతి పత్రాలు ఇచ్చినా, విజ్ఞాపలు చేసుకున్నా ప్రభుత్వ పెద్దలు స్పందించరు. అలాంటిది.. ఓ చిన్న పాప కోసం జపాన్‌ ప్రభుత్వం చేసిన ఏర్పాటు గురించి వింటే ఎవరి మనసైనా కరగడం ఖాయం. ఎన్నో వేల మందికి అవసరమైన రూట్లలోనే రైళ్లను నడపడానికి ప్రభుత్వాలు మీనమేషాలు లెక్కెడతాయి. అలాంటిది ఓ చిన్న పాప స్కూలుకెళ్లి చదువుకునేందుకు వీలుగా ప్రత్యేకంగా ఓ రైల్వే స్టేషన్‌, రైలును నిర్వహిస్తోంది జపాన్‌ ప్రభుత్వం. అలాగని ఆ చిన్న పాప ముఖ్యమంత్రిగారి కూతురో, ప్రధానమంత్రిగారి మనవరాలో కాదు. ఓ ఏజెన్సీ ప్రాంతానికి చెందిన సామాన్య బాలిక.
 
ప్రయాణికుల రాకపోకలు పెద్దగా లేని ప్రాంతాలను గుర్తించి అక్కడకు రైళ్లను నిలిపేయాలని జపాన్‌ ప్రభుత్వం ఇటీవలె నిర్ణయించింది. ఈ జాబితాలో ఓ ఏజెన్సీ కూడా ఉంది. అక్కడకు వెళ్లే రైళ్లను కూడా ఆపేయాలని నిర్ణయించింది. అయితే ఆ ప్రాంతం నుంచి చిన్న బాలిక మాత్రం దగ్గర్లోని పట్టణంలో గల పాఠశాలలో చదువుకుంటోంది. అందుకు ఆ పాప రైళ్లనే ఆశ్రయిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వ పెద్దలు ఆ పాపకు ఎటువంటి ఆటంకమూ లేకుండా రోజూ ఉదయం ఒకసారి, సాయంత్ర ఒకసారి రైలును నడపాలని నిర్ణయించారు. జపాన్‌లోని కామి-షిరాతకి అనే ప్రాంతాల మధ్య రోజూ నడుస్తోన్న ఆ రైలులో ఆ పాప తప్ప ఇంకెవరూ ప్రయాణించరు. ఈ ఒక్క పాప కోసమే ప్రభుత్వం ఓ రైలును నడుపుతోంది. ప్రస్తుతం పాఠశాల విధ్యనభ్యసిస్తున్న ఈ పాప గ్రాడ్యుయేషన్‌ పూర్తి కాగానే ఆ రైలును నిలిపేస్తామని రైల్వే అధికారులు వెల్లడించారు. జపాన్‌ ప్రభుత్వం పెద్ద మనసు.. మన పెద్ద మనుషులకు కూడా ఉంటే బాగుణ్ను కదూ!