Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 15 2014 @ 23:37PM

పదవుల కోసం పాకులాడను


గజ్వేల్‌: తన 30ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ పదవుల కోసం పాకులాడలేదని, పదవులు ఆశించి టీఆర్‌ఎస్‌లో చేరలేదని గజ్వేల్‌ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి అన్నారు. సోమవారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ తెలంగాణ పునర్నిర్మాణంలో తనవంతు కృషి చేసేందుకు మాత్రమే టీఆర్‌ఎస్‌లో చేరానన్నారు. తనను నమ్ముకున్న నాయకులు, కార్యకరల భవిష్యత్తు కోసమే టీఆర్‌ఎస్‌లో చేరినట్లు తెలిపారు. 30ఏళ్లకు రాజకీయ జీవితం ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగానన్నారు. లాబీయింగ్‌ చేయడం తనకు సాధ్యం కాదన్నారు. ఏ పార్టీలోనైనా క్రమశిక్షణ, అంకిత భావంతో పనిచేస్తే పదవులు వెతుక్కుంటూ వస్తాయన్నారు. అందుకే తాను టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం నుంచి ఎలాంటి హామీ తీసుకోకుండానే పార్టీలో చేరానని చెప్పారు. తన కృషిని గుర్తించి పదవులు వస్తే బాధ్యతతో నిర్వహిస్తానన్నారు. ఐదు సంవత్సరాల పాటు తాను ఎమ్మెల్యేగా కొనసాగినందున గజ్వేల్‌ నియోజకవర్గంలో ప్రజల మౌలిక సమస్యలేమిటో తనకు తెలుసునన్నారు. సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావుల ఆహ్వానం తోనే తాను పార్టీలో చేరానని, సీఎం కీర్తి ప్రతిష్టలు పెంచేవిధంగా నియోజకవర్గ అభివృద్ధిలో పాలుపంచుకుంటానని చెప్పారు.