Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 11 2016 @ 19:37PM

అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణ పెద్ద స్కామ్‌: రామకృష్ణ

విజయవాడ: అసైన్డ్‌ భూముల క్రమబద్ధీకరణ అనేది ప్రభుత్వం నిర్వహించే పెద్ద స్కామ్‌ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ. రాష్ట్రంలోని భూములను పెట్టుబడిదారులకు, డబ్బున్న పెద్దలకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం చేసే ప్రయత్నమే క్రమబద్దీకరణ అని ఆరోపించారు. భూములను ఇప్పటి వరకు 33 సంవత్సరాల లీజుకు ఇచ్చే విధానం ఉందని, దీనిని చంద్రబాబు నాయుడు 99 సంవత్సరాలకు పెంచారన్నారని ఆయన ఆరోపించారు.  ఇపుడు అసైన్డ్‌ భూముల క్రమబద్దీకరణ అంటే ఒక సెంటు భూమి కూడా పేదలకు మిగలదని రామకృష్ణ స్పష్టం చేశారు.