Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 15 2014 @ 23:24PM

ఆటపాటల్లో ‘మంత్ర2’


ఛార్మి హీరోయిన్‌గా నటిస్తున్న తాజా సినిమా ‘మంత్ర2’. ఎస్‌.వి.సతీష్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. గ్రీన్‌ ఫిలిమ్స్‌ పతాకంపై కె.ఎ.రవికుమార్‌రెడ్డి సమర్పిస్తున్నారు. పి.శౌరిరెడ్డి, వి.యాదగిరిరెడ్డి, బోనాల శ్రీకాంత్‌ నిర్మిస్తున్నారు. షూటింగ్‌ తుది దశకు చేరుకుంది. చిత్ర సమర్పకుడు కె.ఎ.రవికుమార్‌రెడ్డి మాట్లాడుతూ ‘‘ఒక పాట, రెండు రోజుల టాకీ మినహా షూటింగ్‌ పూర్తయింది. ఈ నెల్లోనే మిగిలిన చిత్రీకరణను పూర్తిచేస్తాం. ప్రస్తుతం డబ్బింగ్‌ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఛార్మి మాట్లాడుతూ ‘‘దాదాపు ఏడేళ్ల క్రితం ‘మంత్ర’ చేశాను. మళ్లీ అలాంటి చిత్రం ఎప్పుడు చేస్తారని అభిమానులు అడుగుతున్నారు. ఆ స్థాయి స్ర్కిప్ట్‌ కుదిరిందనిపించి ఇప్పుడు అంగీకరించాను’’ అని తెలిపారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘‘చార్మి తన పాత్రకు న్యాయం చేయడానికి ఎంతగానో పరితపించారు. చక్రి ఈ తరహా సినిమాకు సంగీతం చేయడం తొలి సారే అయినా, చాలా బాగా స్వరాలను సమకూర్చారు’’ అని చెప్పారు. భారతీయ తెరపై ఇంతవరకు రాని కథతో సినిమా చేస్తున్నామని దర్శకుడు సతీష్‌ తెలిపారు. ఈ సినిమాకు ఎడిటింగ్‌: సిద్ధంశెట్టి బాబు, ప్రొడక్షన్‌ డిజైనర్‌: దేశినేని శ్రీనివాస్‌.