Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 15 2014 @ 23:23PM

అదివరకే నేను ఫేమస్‌ - రేణూ దేశాయ్‌


రేణూ దేశాయ్‌ దర్శకురాలిగా మారి రూపొందిస్తున్న మరాఠీ చిత్రం ‘ఇష్క్‌ వాలా లవ్‌’. తెలుగులోనూ దీన్ని ఆమె అనువదిస్తున్నారు. కొద్దికాలంగా ఈ సినిమా ప్రమోషన్‌ను వేగవంతం చేశారు రేణు. అయితే ఈ ప్రమోషన్‌లో తన మాజీ భర్త పవన్‌కల్యాణ్‌ పేరును ఆమె ఎక్కువగా ఉపయోగించుకుంటున్నదంటూ ఓ వర్గం మీడియా ఆమెపై విమర్శలు సంధించింది. దీంతో ట్విట్టర్‌ ద్వారా ఘాటుగా స్పందించారు రేణు.
‘‘నేను ఫేమస్‌ కావడానికి పవన్‌కల్యాణ్‌ పేరును ఉపయోగించుకుంటున్నానని అతిగా స్పందించే కొంతమంది భావిస్తున్నారు. నిరుడు ఎవరి అండదండలూ, సాయం లేకుండానే ఓ హిట్‌ సినిమాని నిర్మించాను. దానికి పవన్‌కల్యాణ్‌ గారు ఎంతో ఆనందించారు. ఇదివరకే నేను పేరుపొందిన మోడల్‌ని, నటిని. కాబట్టి మీ ఓవరాక్టివ్‌ మెదళ్లకు విశ్రాంతినిచ్చి, అదే శక్తిని ఏదైనా సామాజిక సేవకు వినియోగించండి’’ అని ఆమె ట్వీట్‌ చేశారు.